ఇటీవల కాలంలో తనకు లభించిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్న తెలుగుతేజం రాయుడు... మరోసారి పెద్ద వేదికపై ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తరఫున బరిలోకి దిగిన రాయుడు (150 బంతుల్లో 87; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. ప్రెసిడెంట్స్ జట్టు తరఫున రాయుడిదే టాప్ స్కోర్. అర్ధసెంచరీ చేసింది కూడా తనొక్కడే. బంతితో ఏడు వికెట్లు తీసిన కాశ్మీర్ కుర్రాడు పర్వేజ్ రసూల్ (54 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్సర్) బ్యాటింగ్‌లోనూ రాణించి ఆక ట్టుకున్నాడు. గురునానక్ కాలేజి మైదానంలో జరిగిన ఈ రెండు రోజుల వార్మప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలిరోజు ఆసీస్ 241 పరుగులకు ఆలౌట్ కాగా... రెండో రోజు బుధవారం బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 68.3 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటయింది. ఓపెనర్లు ముకుంద్ (21), ఉతప్ప (24), పార్థీవ్ పటేల్ (23) ఫర్వాలేదనిపించారు. 47/2 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన రాయుడు 213/8 స్కోరు వద్ద అవుటయ్యాడు. ఒక ఎండ్‌లో సహచరులు వెనుదిరుగుతున్నా... ఈ తెలుగు కుర్రాడు చెక్కుచెదరని ఏకాగ్రతతో ఆడాడు. ‘బర్త్‌డే బోయ్’ రసూల్, రాయుడు కలిసి ఏడో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యం లేకపోతే బోర్డు జట్టు కుప్పకూలేదే. ఆసీస్ బౌలర్లలో పేసర్ హెన్రిక్స్ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. స్పిన్నర్ లియోన్ మూడు వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో మ్యాచ్‌ను ముందుగానే నిలిపివేశారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more