భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 408 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు 273 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయిన ఆసీస్ మూడో రోజు తొలి సెషన్ లోనే మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఆసిస్ ఆటగాళ్లు స్కార్ట్ 99 , స్మిత్ 92, కొవాస్ 86, వార్నర్ 71 అత్యధిక పరుగులు చేశారు. భారత బౌలర్లు జడేజా, ఇషాంత్‌కు చెరో మూడు వికెట్లు, ఓజా, అశ్విన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత ఓపెనర్లు ఇద్దరూ కంగారులకు మెచ్చెమటలు పట్టించారు. మొదటి టెస్టు ఆడుతున్న శిఖర్ దావన్ బౌలర్ల పై విరుచుకు పడ్డాడు. అతను బ్యాటింగ్ చేసిన తీరు వన్డే మ్యాచ్ ని తలపించింది. 85 బంతుల్లోనే 100 పరుగులు చేసి తొలి టెస్ట్లోనే దావన్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మేన్గా రికార్డు సృష్టించాడు. దావన్ 168 బంతుల్లో ఒక సిక్స్ర్ర్, 33 పోర్లతో 185 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ కూడా 181 బంతుల్లో రెండు సిక్స్ర్లు, 8 ఫోర్లతో 83 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. వీరిద్దరు ఒకరికొకరు సహకారం అందించుకుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టారు. ఈ ఓపెనర్ల జంటను విడదీయడానికి ఆసీస్ బౌలర్లు వేసిన ఎత్తులు ఏమీ పనిచేయలేదు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 283 పరుగుల వద్ద ఉంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more