ఐపీఎల్ టి20 క్రికెట్ లీగ్ టి 420 లీగ్ గా మారింది. దీనికి కారణం ఇటీవల బయటపడిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతమే. ఈ ఫిక్సింగ్ ఆరోపణలు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. తాజాగా ఈ ఫిక్సింగ్ ఉదంతం రాజస్థాన్ జట్టు సభ్యులకే కాకుండా భారత్ క్రికెట్ పెద్ద అయిన శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈఓ అయిన గురునాథ్ మెడకు చుట్టుకునే విధంగా ఉన్నది. ఇప్పటికే ఈ కేసులో ఆటగాళ్ళతో పాటు బాలీవుడ్ నటుడు ధారాసింగ్ కొడుకు వింధూదారా సింగ్ ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈయన విచారణ సమయంలో చెప్పిన విషయాలు మరింత విస్మయంగా ఉన్నాయి. దీంతో ముంబై పోలీసులు బీసీసీఐ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ కి నోటీసులు పంపడమే కాకుండా, నేటి (శుక్రవారం) ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోగా ముంబై క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. అంతకుముందు ఉదయం చెన్నైలోని గురునాథ్ ఇంటికి ఇద్దరు సభ్యుల పోలీసుల బృందం విచారణ కోసం వచ్చినా అతడు అందుబాటులో లేడు. కానీ ఈ సమన్ల పై మాత్రం స్పందించాడు. మరో రెండు రోజుల్లో చెన్నై ఫైనల్ మ్యాచ్ ఉన్నందున తనకు మరికొంత సమయం ఇవ్వాలని, ఆ మ్యాచ్ తరువాత విచారణకు హాజరవుతానని ఆయన ఓ లేఖను క్రైం బ్రాంబి పోలీసులకు పంపిన లేఖలో ఉన్నట్లు సమాచారం. ఆయన విన్నపాన్ని పరిశీలనలో ఉంచామని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా అల్లుడుగారి మెడకు ఫిక్సింగ్ భూతం పడితే క్రికెట్ పెద్ద అయిన మామగా ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more