భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మంచి క్రికెట్ ప్లేయర్ గానే కాకుండా, మంచి బిజినెస్ మెన్ గా కూడా ఎదుగుతున్నాడు. దీనికి సంబంధించిన ఆధారాలు బయటికి రావడంతో అందరు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఇప్పటికే ధోనికి సంబంధించిన వ్యాపార సంబంధాల పై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. రితీ స్పోర్ట్స్ మార్కెటింగ్ సంస్థలో ఆయన 15 శాతం వాటా ఉన్నట్లు, మరో నలుగురు క్రికెటర్లను ఆ సంస్థ ఎండార్స్ చేస్తుందని, ధోనీ కంపెనీ మేనేజ్ చేసే అటగాళ్లకు ధోని అండదండలు పుష్కలంగా ఉంటాయని, ఫామ్ లేని వాళ్ళను కూడా తన కంపెనీ ఆటగాళ్లే కాబట్టి, ఇందులో అనుచిత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా మరొకటి బయటపడింది. ఆమ్రపాలీ మహి డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో తన భార్య సాక్షి పేరున పెట్టుబడులు పెట్టాడు. కార్పొరేట్ మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో ఈ విషయం బయటపడింది. ఆ కంపెనీకి ధోనీ భార్య సాక్షి డైరెక్టర్గా ఉంది. అంతేగాక ఇళ్లు కట్టి ఇచ్చే ఆ కంపెనీలో 25 శాతం వాటా కూడా కలిగి ఉంది. తన నిక్ నేమ్ ఉన్న ఈ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. దీనికి బట్టి చూస్తే ధోనికి ఇంకెన్ని వ్యాపారాలు ఉన్నాయో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more