స్పాట్ ఫికింగ్స్ కేసులో ఢిల్లీ పోలీసులు తనపై మోకా చట్టం ప్రయోగించడం అ న్యాయమని కళంకిత క్రికెటర్ అజిత్ చండీలా ఆరోపించాడు. తానేమీ ఉగ్రవాదిని కాదని అన్నా డు. ఈ కేసులో తనపై వ్యతిరేకంగా ఎలాంటి ఆధారమూ లేదని చెప్పాడు. ఈ కుంభకోణంలో తను ఎవరినీ సంప్రదించలేదన్నాడు. 'మంచి క్రికెటర్ కావాలన్నదే నా కల. ఓ దురదృష్ట సంఘటనతో అది చెదిరింది. అయితే నేను నిర్దోషిగా బయటపడతాను. ఐపీఎల్లో ఎక్కువ డబ్బు వస్తోంది. రాయల్‌గా బతకడంలో తప్పేముంది' అని చండీ లా వ్యాఖ్యానించాడు. ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్ చేశారన్న ఆరోపణలతో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్‌తో పాటు చండీలాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శ్రీశాంత్, చవాన్‌కు ఇప్పటికే బెయిల్‌పై బయటకు రాగా.. చండీలాకు ఇటీవలే రెండ్రోజుల తాత్కాలిక బెయిల్ దక్కింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టుల సంఖ్య 30కి చేరింది. తాజాగా ఢిల్లీ పోలీసులు జైపూర్‌లో చంద్రేశ్ జైన్ అలియాస్ 'జూపిటర్' అనే బుకీని అరెస్టు చేశారు. జైన్‌ను కోర్టులో హాజరుపర్చిన తర్వాత ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more