ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ తొలి సెమీఫైనల్లో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పుణ సిస్టన్స్తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ హాట్‌షాట్స్ విజయం సాధించింది. ఫైనల్స్‌కి చేరింది. ఇటు మహిళల, అటు పురుషుల సింగిల్స్ విభాగాల్లో హాట్‌షాట్స్ క్రీడాకారులు రాణించారు. డబుల్స్ విభాగంలోనూ అదే ఊపు కొనసాగించింది. రేపు బెంగళూరులో రెండో సెమీఫైనల్ మ్యాచ్ ముంబై ఇండియన్స్, లక్నో వారియర్స్ మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలుపొందే జట్టుతో ఈ నెల 31న ఫైనల్లో హైదరాబాద్ హాట్‌షాట్స్ తలపడనుంది. సెమీఫైనల్లో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ హాట్‌షాట్స్ క్రీడాకారుడు అజయ్ జయరామ్ ప్రారంభం నుంచి ప్రత్యర్థి పుణ సిస్టన్స్పై ఆధిపత్యం సాధిస్తూ వచ్చాడు. తొలి గేమ్స్‌ను 21-19తేడాతో గెలుచుకోగా, రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ఏమాత్రం పోటీ లేకుండా పోయింది. రెండో గేమ్‌ను అజయ్ జయరాం 21-8 తేడాతో విజయం సాధించాడు. హైదరాబాద్ హాట్‌షాట్స్‌కు 1-0 ఆధిక్యం లభించింది. సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ (హైదరాబాద్ హాట్‌షాట్స్), జులియన్ షెంక్ (పుణ సిస్టన్స్) తలపడ్డారు. సైనా నెహ్వాల్ ఐబిఎల్ టోర్నీలో ఐదు మహిళల సింగిల్స్‌లో పాల్గొనగా, ఐదింటిలోనూ విజయం సాధించింది. జులియన్ షెంక్ ఐదు గేమ్‌లలో పాల్గొనగా, మూడింటిలో గెలుపొంది, రెండింటిలో ఓటమిని చవిచూసింది. ఆట ప్రారంభం నుంచి సైనానెహ్వాల్, జులియన్ షెంక్‌పై ఆధిపత్యం సాగించింది. సైనాకు ప్రత్యర్థి నుంచి ఏమాత్రం పోటీ లేకుండా పోయింది. దీంతో తొలి గేమ్‌ను 21-10 తేడాతో సైనా నెహ్వాల్ గెలిచింది. రెండో గేమ్‌లోనూ సైనా అదే ఆటతీరును ప్రదర్శించింది. అయితే ప్రత్యర్థి షెంక్ నుంచి సైనా గట్టిపోటీని ఎదుర్కొంది. ఇరువురూ పోటాపోటీగా పాయింట్లు సాధిస్తూ వచ్చారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more