Sania mirza to get another crore rupees

sania mirza, sania mirza wiki, sania mirza marriage, sania mirza love, sania mirza pakisthan, sania mirza house, sania mirza latest news, sania mirza in asian games, sania mirza hot, sania mirza hot photos, sania mirza latest hot photos, asian games, asian games latest updates, asian games india medals, indian athlets in asian games, sports news, kcr, kcr wiki, kcr latest, kcr comments, kcr funny, kcr on sania mirza, telangana, telangana movement, telangana bill, telangana state, telangana brand ambassador, andhrapradesh brand ambassadorg

tennis star sania mirza to get an other crore rupees for her asian games gold medal victory : telangana chief minister kcr congratulated sania mirza for winnig gold medal in asian games 2014

మెడల్ కొట్టు.., మరో కోటి పట్టు

Posted: 09/30/2014 01:23 PM IST
Sania mirza to get another crore rupees

టెన్నిస్ స్టార్ సానియా మిర్జాకు అదృష్టం అదేదో పట్టినట్లగా పట్టింది. ఈ మద్య అమ్మడు ఆడుతున్న మ్యాచ్ లు అన్ని గెలుస్తూ గోల్డ్ మెడల్స్ సాధిస్తోంది. యూఎస్ ఓపెన్ లో మిక్సిడ్ డబుల్స్ విభాగంలో టైటిల్ నెగ్గింది. ఇప్పుడు ఆసియా గేమ్స్ లో కూడా మిక్సిడ్ డబుల్స్ లో స్వర్ణం గెలుచుకుంది. ఈ విజయం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సానియా.., స్వర్ణం గెలవటం ద్వారా.., రాష్ర్టం ఖ్యాతిని ప్రపంచానికి చాటింది అని ప్రశంసించారు.

సానియా తాజా విజయంపై అధికారిక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం.., ముఖ్యమంత్రి హైదరాబాదీ స్టార్ ను అభినందించారని తెలిపింది. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ.., తెలంగాణకు మంచి పేరు తేవాలని కోరుకున్నట్లు వెల్లడించింది. ఇక మరో విషయం ఏమిటంటే ప్రపంచ క్రీడల్లో గోల్డ్ మెడల్ కొడితే కోటి రూపాయలు బహుమతి ఇస్తామని కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఈ మేరకు సానియా ఇప్పటికే యూఎస్ ఓపెన్ టైటిల్ కు సంబంధించి కోటి రూపాయలు అందుకుంది.

అంతకు ముందు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడినపుడు కూడా ఓ కోటి రూపాయలు ప్రభుత్వం నుంచి దక్కించుకుంది. తాజాగా ఆసియా గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో మరో కోటి రూపాయలు తెలంగాణ సర్కారు ముట్టచెప్పాల్సి ఉంది. టెన్నిస్ స్టార్ హైదరాబాద్ కు రాగానే  ఘన స్వాగతం పలికి ఈ బహుమతిని ప్రకటించే అవకాశం ఉంది. ఇలా రెండు నెలల్లో రెండు కోట్లు గెలుచుకుని నిజంగానే స్టార్ అనిపించుకుంది. అయితే ఈ కోటి రూపాయలు మరి హైదరాబాద్ అకౌంట్లో పడతాయో లేక.., పాకిస్థాన్ లోని అత్తగారింటికి వెళతాయో వారికే తెలియాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asian games  sania mirza  kcr  telangana  

Other Articles