Ivan ivanovich australia grandslam open latest news

ivan ivanovich latest news, ivanovich news, australia open grandslam, ivanovich australia open grandslam, indian tennis players, indian badminton players

Ivan ivanovich australia grandslam open latest news : ivan ivanovich lost austrlia open grandslam in the first round against hrenika

ఛాంపియన్స్ ఇలా వెళ్లారో లేదో.. అలా తిరిగొచ్చారు!

Posted: 01/20/2015 01:01 PM IST
Ivan ivanovich australia grandslam open latest news

టెన్నిస్ క్రీడారంగంలో ఆరితేరిన ఛాంపియన్స్’లలో ఒకరైన ఇవనోవిచ్’కి తొలిరోజే భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్’స్లామ్’లో భాగంగా పోటీల్లో పాలుపంచుకున్న ఈమె.. మొదటి రౌండ్లోనే తన చెత్త ప్రదర్శనతో ఇంటిముఖం పట్టింది. నిజానికి ఈ అమ్మడు తన ప్రతిభతో ప్రపంచదిగ్గజాలను సైతం ఓడించిన సందర్భాలూ చాలానే వున్నాయి. కానీ.. ఈసారి మొదటిరౌండ్లోనే ఇలా తిరిగి వెనక్కి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్’స్లామ్’లోని మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఇవనోవిచ్, అన్’సీడెడ్ చెక్ రిపబ్లిక్ భామ హ్రడెకాతో తలపడింది. మొదటి ఆటలో ఇవ తన అద్భుత పెర్’ఫార్మెన్స్’తో హ్రడెకాకు ముచ్చెమటలే పట్టించింది కానీ.. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆట మొదలైన కొద్దిసేపట్లోనే ఇవనోవిచ్ 6-1 స్కోరుతో హ్రడెకాను ఓడించి విజయదిశగా దూసుకెళ్లింది.

కానీ రెండో ఆటలో ఇద్దరి మధ్య పోటీ వాడీవేడీగా జరిగింది. అయితే రెండో ఆటలో హ్రడెకా 6-3తో ఇవను ఓడించింది. ఇక మూడో ఆటలో ఇవ పరిస్థితి మరి దారుణంగా మారింది. ఎంత ప్రయత్నించినా ఆమె హ్రడెకా గెలుపును అడ్డుకోలేకపోయింది. దీంతో హ్రడెకా మూడో ఆటను కూడా 6-2తో గెలుపొందింది. అంటే.. మొత్తంగా చూస్తే హ్రడెకా 1-6, 6-3, 6-2 స్కోరుతో ఇవనోవిచ్’పై సంచలన విజయం సాధించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ivan ivanovich latest news  australia open grandslam news  

Other Articles