భారత టెన్నీస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా ఆటలలోనే కాదు.. సినిమా నాలెజ్డ్ లోనూ అవగాహన బాగానే వుంది. నిత్యం ప్రాక్టీసు, టార్నోమెంట్లతో బిజీగా వుంటే సానియా.. సినిమాలు ఏం చేస్తుంది.. సినిమా నాలెజ్డ్ ఏం వుంటుందిలే అనుకునే వారికి షాక్ ఇచ్చేలా చేసింది సానియా. పురుషుల టెన్నిస్‌లో ఆ ఇద్దరు దిగ్గజాలను కలిసిన అమె వారిని ఓ హిందీ సినిమా టైటిల్ తో పోల్చి .. అభిమానులను కూడా విస్మయానికి గురిచేసింది.
కోల్‌కతాలో ఈ నెల 25న జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా కలిసి ప్రాక్టీస్ చేశారు. ఈ కలయికను సెల్ఫీగా మార్చేసింది సానియా. దీంతో భారత టెన్నిస్ హేమాహేమీలు ముగ్గురు ఒకే ‘చిత్రం’లో చేరారు. దీనిని సానియా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. షారుఖ్-సల్మాన్‌ల సూపర్ హిట్ మూవీ డైలాగ్‌ను గుర్తు చేస్తూ ‘ నా కరణ్-అర్జున్ వచ్చేశారు. ఇద్దరిలో ఎవరు ఎవరో వారే తేల్చుకుంటారు’ అని సరదాగా కామెంట్ చేసింది. ఐపీటీఎల్ ప్రమోషన్‌లో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని సానియా అకాడమీలో రెండో ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more