నిన్నటి దాకా కేవలం క్రికెట్ వరకు మాత్రమే ఉంది అనుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ టెన్నిస్ లో కూడా ఉన్నట్లు తేలింది. టెన్నీస్ క్రీడాభిమానాలు. మొత్తం 16 మంది క్రీడాకారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత దశాబ్దకాలంగా టాప్ 50లో ఉంటున్న ఈ క్రీడాకారులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినపడతున్నాయి. ఫిక్సింగ్ కు సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయని తెలుపుతున్నారు అధికారులు. ఆస్ట్రేలియా ఓపెన్ లో పాల్గొంటున్న 8 మంది టాప్ సీడ్ క్రీడాకారుల పాత్ర ఉన్నట్లు చెబుతున్నాయి బీబీసీ – బజ్ ఫీడ్ వర్గాలు. 2007 – 2009 మధ్య జరిగిన మ్యాచ్ లలో అవినీతి జరిగినట్టు తెలుపుతున్నాయి. అయితే దీనిపై స్పందించిన టెన్నీస్ సమాఖ్య టెన్నీస్ లో అవినీతి రూపుమాపడానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది.
అయితే టెన్నిస్ క్రీడలో రారాజుగా పేరున్న జకోవిచ్ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ మీద బాంబు పేల్చారు. 2007లో తనను కూడా బెట్టింగ్ దళారులు పరోక్షంగా ఆశ్రయించారని జకోవిక్ తెలిపారు. దాంతో టెన్నిస్ ఆటలో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఏమేరకు ఉందో అని అందరు చర్చించుకుంటున్నారు. అప్పట్లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవాలని తనకు దళారులు చెప్పారని అన్నారు. అయితే తాను వెంటనే దళారుల ఆఫర్‌ను తిరస్కరించానని, తాను గట్టిగా స్పందించడంతో వారు మళ్లీ తన జోలికి రాలేదని జకోవిక్ తెలిపారు. టెన్నిస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్పై బీబీసీ కథనాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. అప్పుడప్పుడు టెన్నిస్‌లో ఇలాంటి ఆరోపణలు రావడం తన దృష్టికి కూడా వచ్చిందని తెలిపారు. మ్యాచ్ ఓడిపోతే రెండు లక్షల డాలర్లు ఇస్తామని జకోవిక్‌కు దళారులు ఆఫర్ చేసినట్టు తెలిసింది. దాంతో టెన్నిస్ సమాఖ్య మీద విమర్శలు వస్తున్నాయి. అసలు ఎక్కడా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు సమాచారం లేదని చెప్పడం మీద విమర్శలు రాగా.. దీని మీద చర్యలకు పూనుకుంటామని టెన్నిస్ ఫెడరేషన్ ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more