భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా మరో అరుదైన ఘనతను సాధించింది. వరుసగా 80 వారాల పాటు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగి చరిత్రలో తనకంటూ మరో పేజీని లిఖించుకుంది. తద్వారా మహిళల డబుల్స్ విభాగంలో ఎక్కువ రోజులు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన భారత క్రీడాకారిణిగా సానియా మిర్జా రికార్డులకెక్కింది.. సానియా కంటే ముందు ముగ్గురు ఉమెన్ ప్లేయర్స్ మాత్రమే ఈ ఘనతను సాధించారు.
వారిలో మార్టినా నవ్రతిలోవా (181 వారాలు) తొలిస్థానంలో ఉండగా.. కారా బ్లాక్ (145 వారాలు), లీజెల్ హ్యూబెర్ (134 వారాలు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ ఘనత సాధించడం పట్ల సానియా మిర్జా సంతోషం వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. 'నంబర్ వన్ ప్లేయర్‌గా ఈ రోజుకు వరుసగా 80 వారాలు పూర్తి చేసుకున్నాను. ఇది అద్భుత ప్రయాణం. మరింతగా కష్టపడేందుకు నాకు ప్రేరణనిస్తోంద'ని సానియా ట్వీట్ చేసింది.
సానియా మిర్జా ట్వీట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యంగ్యంగా దీని అర్ధం డబుల్స్ విభాగంలో 'నెంబర్ వన్ డబుల్స్ ప్లేయర్, కంగ్రాట్స్' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై సానియా మిర్జా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను మహిళల సింగిల్స్ నుంచి ఎప్పుడో తప్పుకున్నానని, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? నా ఖర్మ ఈ మాత్రం కూడా తెలియకుండా ఉన్నారా? అంటూ సానియా ట్వీట్ చేశారు. కాగా, మార్టినా హింగిస్‌తో కలిసి ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచి సానియా నంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది.
ప్రస్తుతం సానియా ఖాతాలో 8885 పాయింట్లు ఉన్నాయి. మార్టినా హింగిస్‌తో కలిసి కేవలం 12 నెలల్లో 13 టైటిల్స్ గెలిచి సాంటినా జోడీగా పేరుగాంచింది. ఈ ఇద్దరూ వరుసగా 41 విజయాలు సాధించారు. అప్పటి నుంచి వీరిద్దరి జోడీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన సానియాకు ట్విట్టర్ ద్వారా మహేశ్ భూపతి, పీవీ సింధు, గుత్తా జ్వాల అభినందనలు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more