South africa crushed india by 141 runs runs first odi

South Africa crushed India by 141 runs, johnsburg,south africa,wanderers stadium,indian cricket team, MS Dhoni, India vs South Africa, India cricket, Quinton de Kock, Dale Steyn, AB de Villiers, South Africa cricket, Rohit Sharma.

A team that had won six ODI titles in a row suffered a major blow as South Africa thrashed them by 141 runs in the first ODI match played at the New Wanderers Stadium, Johannesburg.

తొలి వన్డేలో మనోళ్ళకు తకిటతకిటే

Posted: 12/06/2013 09:58 AM IST
South africa crushed india by 141 runs runs first odi

గత మూడు సంవత్సారాల క్రితం దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత్ ఘోర పరాజయాల్ని మూటగట్టుకొన్న విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు యువ రక్తంతో సఫారీల గడ్డ పై అడుగుపెట్టిన టీం ఇండియా పాత కథనే రిపీట్ చేసింది. ఇప్పటి వరకు స్వదేశీ గడ్డపై పులిలా ఉన్న టీం ఇండియా సఫారీ గడ్డ పై ఒక్కసారిగా పిల్లిలా మారిపోయింది. పర్యటనకు ముందు సఫారీలకు సవాల్ విసిరిన కుర్రాళ్ళు వాస్తవంలోకి వచ్చారు. మొదటి నుండి భయపడ్డట్లుగానే దక్షిణాఫ్రికా బౌలర్లకు బెంబేలెత్తి పోయారు. ఫలితంగా ఇక్కడి వాండరర్స్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది.

అన్ని విభాగాల్లో రాణించిన దక్షిణాఫ్రికా 141 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీం ఇండియా బౌలర్లను సఫారీలు ఓ ఆట ఆడుకున్నారు. హాషిమ్ ఆమ్లా (88 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 152 పరుగులు జోడించగా... చివర్లో డివిలియర్స్ (47 బంతుల్లో 77; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), డుమిని (29 బంతుల్లో 59 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగిపోయారు. దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లు ఏ దశలో బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేయలేకపోయారు.

అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన టీం ఇండియా 41 ఓవర్లలో 217 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ల రోహిత్, ధావన్ ఐదుగురు పేసర్లు వేస్తున్న బంతులు బుల్లెట్ల తరహాలో దూసుకొస్తుంటే భారత బ్యాటింగ్ సరికొత్త హీరో రోహిత్ శర్మ బంతిని బ్యాట్‌తో తాకించడానికి 16 బంతులు తీసుకున్నాడంటే సఫారీల బౌలింగ్ కి మనవాళ్ళు ఏమాత్రం భయపడ్డారో అర్థం చేసుకొవచ్చు. ఆటగాళ్లలో కెప్టెన్ ధోని (71 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles