Sachin tendulkar silver coins to be launched on march 14

Sachin Tendulkar, Sachin Tendulkar silver coins, Sachin, Sachin Tendulkar silver coins launched, March 14.

Sachin Tendulkar silver coins to be launched on March 14

సచిన్ సిల్వర్ చిత్రపటం విడుదల?

Posted: 03/12/2014 11:25 AM IST
Sachin tendulkar silver coins to be launched on march 14

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ చిత్రపటం, పేరు, సంతకంతో కూడిన సిల్వర్‌ కాయిన్స్ ను ఈ నెల 14న ఓ ప్రత్యేక కార్యక్రమం ద్వారా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం స్వయంగా భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కరే ఆవిష్కరించనున్నారు. వ్యాల్యూ మార్ట్  గోల్ట్  అండ్‌ జువెల్లర్‌‌స అండ్‌ డైమాండ్స్  ఇండియా కంపెనీ వారు ఈ కాయిన్స్ ను తయారు చేయించారు. 

1989లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సచిన్‌ 24 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌లో సాధించిన మొత్తం పరుగులు 15921 కాగా.. అంతే మొత్తంలో ఈ కంపెనీలు సిల్వర్‌  కాయిన్స్ ను విడుదల చేయనున్నాయి. స్విట్టర్లాండ్‌ కేంద్రంగా పనిచేస్తున్న వాల్కంబీ ఎస్‌ఏ ఆధ్వర్యంలో అత్యంత మేలిమి నాణ్యత కల్గిన స్విలర్‌ను ఉపయోగిస్తు కాయిన్స్ తయారు చేయిస్తున్నారు. ఒక్కో నాణెం 200 గ్రాములుగా ఉంటుందని కంపెనీ నిర్వహకులు తెలిపారు. 

అయితే సచిన్‌ పేరుతో అచ్చు చేయబడిన సిల్వర్‌ కాయిన్స్  ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నాయని, అయితే ఆ కాయిన్స్ కేవలం 10, 20 గ్రాముల సిల్వర్‌తో తయారు చేయబడిన…వని.. అంతే కాకుండా ఆ కాయిన్స్ సచిన్‌ సంతకం, ఫొటో మాత్రమే ముద్రించి ఉన్నాయని, ప్రస్తుతం 200 గ్రాములతో తయారు చేయబడ్డ కాయిన్స్ సచిన్‌ సచిన్‌ ఆడిన టెస్ట్ ల సంఖ్యతో పాటు అతని పేరును కూడా ముద్రిస్తున్నట్లు కంపెనీ నిర్వహకులు తెలిపారు.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles