Sachin tendulkar upbeat about team prospects in 2015 world cup

Sachin Tendulkar, 2015 World Cup, Sachin Tendulkar silver coins released.

Sachin Tendulkar upbeat about team prospects in 2015 World Cup, Sachin Tendulkar silver coins released

అలాంటి అంపైర్లపై ఆగ్రహం కలిగింది కానీ - హద్దుదాటలేదు.

Posted: 03/15/2014 01:13 PM IST
Sachin tendulkar upbeat about team prospects in 2015 world cup

ప్రశాంతంగా కనిపించే సముద్రంలో కూడా అప్పడుప్పుడు సునామీ కనిపిస్తుంది.   ఎప్పుడు సైలెంట్ గా ఉంటే సచిన్ కూడా  ఆగ్రహం కట్టలు తెంచుకునేదట. కానీ ఆయన ఎప్పుడు  హద్దుదాటలేదు.  టీమిండియా ప్రదర్శన ఇటీవల స్థాయికి తగ్గట్టుగా లేనప్పటికీ, వరల్డ్‌కప్ (2015)ను నిలబెట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు సచిన్ టెండూల్కర్. ‘మన జట్టులో ప్రతిభకు కొదువలేదు. 

కొందరు ప్రత్యేకమైన ఆటగాళ్లున్నారు. అయినా జట్టు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. ఐతే పరిస్థితులు అప్పటివరకు (2015) మారవచ్చు. ఇప్పుడున్న దశలో జట్టుకు అభిమానుల మద్దతు అవసరముంది’ అని సచిన్ అన్నాడు. వెండి నాణేన్ని ఆవిష్కరిస్తున్న సచిన్. కలిస్, వార్న్‌లను తోసిరాజని సచిన్ ‘క్రికెటర్ ఆఫ్ ది జనరేషన్’గా ఎంపికయ్యాడు.

ఇక తన కెరీర్ గురించి స్పందిస్తూ, డ్రెస్సింగ్ రూంలో సహచరులు తన జూనియర్లయినా వారితో సరదాగా ఉండేవాణ్నని, కెరీర్‌లో 100 సెంచరీలు సాధించినా, వందో సెంచరీని సాధించేందుకు ఎంతో కష్టాపడ్డానని చెప్పాడు. క్రికెట్లో పుట్టుకొస్తున్న కొత్త షాట్లపై స్పందిస్తూ, మిగతా క్రీడల్లాగే క్రికెటూ మారుతోందన్నాడు. 

కొన్ని సమయల్లో తప్పుడు అంపైరింగ్ వల్ల ఔటైనప్పుడు మిగతా క్రికెటర్ల తరహాలోనే తనకూ ఆగ్రహం కలిగేదని, అయితే అదెప్పుడూ శ్రుతిమించలేదన్నాడు. కొన్నిసార్లు అంపైర్లు తనదగ్గరకొచ్చి తమ పొరపాట్లను అంగీకరించిన సందర్భాలున్నాయన్నాడు.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles