Sachin does not play football need to teach ganguly

Sachin Tendulkar, Sourav Ganguly, Indian Super League,Kolkata franchise, Kochi team,

ourav Ganguly and Sachin Tendulkar will be on opposite sides in the inaugural edition of the Indian Super League football..

సచిన్ కి ఫుట్ బాల్ నేర్పిస్తానంటున్నాడు

Posted: 04/15/2014 12:50 PM IST
Sachin does not play football need to teach ganguly

క్రికెట్ లెజెండ్ గా పేరు సంపాదించిన సచిన్ టెండూల్కర్ కి ఆట నేర్పించేవారెవరైనా ఉన్నారా అంటే నేనున్నానని అంటున్నాడు మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరబ్ గంగూలీ. క్రికెట్ లో సచిన్ కన్నా దాదాకే ఎక్కువ వెళకులు తెలుసా అంటే ఫుట్ బాల్ లో తెలుసునంటున్నాడు. అవును చిన్నప్పటి నుండి దాదాకు ఫుట్ బాల్ అంటే ఎంతో ఇష్టం.

ఒక రకంగా ఆయన ఫుట్ బాల్ ప్లేయర్ కూడా. అలాంటి దాదా ఇండియన్ సూపర్ లీగ్ లో కోల్ కత్తా ఫ్రాంచైజీకి కొనుగోలు చేశాడు. అటు సచిన్ కోచి ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. కొనడం అయితే కొన్నాడు కానీ సచిన్ కి ఫుట్ బాల్ ఆట రాదు... అందుకే ఆయనకు ఫుట్ బాల్ ఆట నేర్పిస్తానని అంటున్నాడు.

దాదాపు 15 ఏళ్లు మేం కలిసి క్రికెట్ ఆడినా సచిన్ బెంగాలీ పూర్తిగా నేర్చుకోలేకపోయాడు. అలాగే ఫుట్‌బాల్ నేర్చుకోవడానికి 15 ఏళ్ల సమయం తీసుకోకూడదనే కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నేళ్ల తర్వాత సచిన్ మైదానంలో కనిపించడు. కాబట్టి ఈ ఆటను వేగంగా నేర్చుకోవాలని చమత్కరిస్తున్నాడు. దాదా అన్నట్లుగా సచిన్ ఎన్ని రోజుల్లో ఫుట్ బాబ్ నేర్చుకుంటాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles