పంజాబ్ కింగ్స్ లెవెన్... ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ టోర్నీ ల్లో కనీసం లీగ్ దశ కూడా దాటలేదు. గత సీజన్లలాగే ఈ జట్టు పై జనాలకు ఎలాంటి అంచానాలు లేవు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సీజన్ ని గ్రాండ్ గా మొదలు పెట్టింది. మొదటి మ్యాచ్ లో చెన్నైకి చుక్కలు చూపించిన మ్యాక్స్ వెల్ రాత్రి రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో అదే ఊపును కొనసాగించి ఇక ముందు జరగబోయే మ్యాచ్ ల్లో లక్ష్యం ఎంతదైనా చిన్నబోవాల్సిందే అని సవాల్ విసిరాడు.
తనదైన శైలిలో భారీ షాట్లతో విరుచుకుపడి దాదాపు అదే స్కోరును ఛేదించడంలో కీలకపాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లాగే మ్యాక్స్ సెంచరీ చేజార్చుకున్నా... చివర్లో డేవిడ్ మిల్లర్ మెరుపులతో కింగ్స్ ఎలెవన్‌కు వరుసగా రెండో విజయం దక్కింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (34 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), వాట్సన్ (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించారు.
192 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ మ్యాక్స్‌వెల్ (45 బంతుల్లో 89; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), మిల్లర్ (19 బంతుల్లో 51 నాటౌట్; 6 సిక్స్‌లు) అద్భుత బ్యాటింగ్‌తో పంజాబ్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు మ్యాక్స్ వెల్ కి దక్కింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more