Dhoni compares maxwell with sachin sehwag talent

MS Dhoni, Chennai Super Kings, Indian Premier League, Virender Sehwag, Kings XI Punjab, Glenn Maxwell

Captain MS Dhoni Compares Glenn Maxwell With Sachin Tendulkar, Virender Sehwag in Talent.

మ్యాక్స్ వెల్ పై ధోని ప్రశంసల జల్లు

Posted: 05/08/2014 05:16 PM IST
Dhoni compares maxwell with sachin sehwag talent

ఈ సీజన్లో కళ్లు చెదిరే షాట్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్న గ్లెన్ మ్యాక్స్ వెల్ నిన్న జరిగిన మ్యాచ్ లో చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. అతడు షాట్లు కొడుతుంటే వికెట్ల వెనకాలే ఉన్న ధోనికి కళ్ళు తిరిగాయో ఏమో కానీ, ఆయన పై ప్రశంసల వర్షం కురిపించాడు ఈ కూల్ కెప్టెన్. దిగ్గజ బ్యాట్స్ మెన్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ల మాదిరి విభిన్నమైన ప్రతిభ మాక్స్ వెల్లోనూ ఉందని ప్రశంసించాడు.

అతని బ్యాటింగ్ అనూహ్యంగా ఉందని, అదే సమయంలో తోటి బ్యాట్స్ మెన్ కు మద్దతిచ్చాడని పేర్కొన్నాడు. సిక్సులు బాదే విషయంలో మరింత సీరియస్ నెస్ అవసరమని మాక్స్ కు ధోనీ సూచించాడు. నిన్న మ్యాక్స్ వెల్ బ్యాటింగ్ చూసిన మిగతా జట్ల బౌలర్లు తరువాతి మ్యాచ్ ల్లో బౌలింగ్ చేయాలంటే జంకుతారనడంలో సందేహం లేదు. చూద్దాం ముందు ముందు మ్యాచ్ ల్లో ఎంత మంది బౌలర్లు ఈ భీకర బ్యాట్స్ మెన్ కి బలవుతారో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles