Yuvraj records of no use to ipl

Yuvraj records of no use to IPL 7, Yuvraj Singh all round record, Royal Challengers Bangalore Rajasthan Royals win IPL 7

Yuvraj records of no use to IPL

యువరాజ్ రికార్డ్ లు నిష్ఫలితం!

Posted: 05/12/2014 04:43 PM IST
Yuvraj records of no use to ipl

యువరాజ్ కి వ్యక్తిగతంగా అవి రికార్డ్ లే కానీ ఐపిల్ దృష్ట్యా రాయల్ ఛాలెంజర్స్ కి లాభించింది లేదు.  

ఐపిఎల్ చరిత్రలో రాయల్ చాలెంజెర్స్ గడించిన 190/5 అన్నది రాజస్థాన్ రాయల్స్ తో అడిన ఆటల్లో అత్యధికమైన స్కోర్.  అంతకు ముందు 2012 లో జయ్ పూర్ లో ఆడినప్పుడు స్కోర్ 189/3.  యువరాజ్ సింగ్ ఆడిన 38 బాల్స్ కి 83 పరుగులు అన్నది అతని టి-20 రికార్డ్ స్కోర్.  పోయిన సంవత్సరం ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు 77 పరుగులు అతని అత్యధిక పరుగులు.  2011 లో డేర్ డెవిల్స్ తో ఆడినప్పుడు యువరాజ్ సింగ్ అత్యధిక పరుగులు 66.  మొత్తం మీద యువరాజ్ ఐపిఎల్ 7వ, టి-20లో 15వ అర్థ శతకం అవుతోంది ఈ స్కోర్.  

ఇక బౌలింగ్ లో చూసుకుంటే, 35 బాల్స్ లో 4 వికెట్లు తీయటమనేది ఐపిఎల్ లో అతని అత్యధిక ఆటలో రెండవ స్థానంలో నిలుస్తుంది.  ఎందుకంటే పోయినసారి 2011 లోడేర్ డెవిల్స్ తో ఆడినప్పుడు 29 బాల్స్ లో 4 వికెట్లు తీయటం జరిగింది.  

యువరాజ్ ఐపిల్ చరిత్రలో ఒకే మ్యాచ్ లో 50 పరుగులు తీయటం, నాలుగు వికెట్లు తీయటం ఇది రెండవసారి.  అయితే రెండు సార్లు మ్యాచ్ అయితే ఓడిపోవటం జరిగింది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles