Mudgal committee to investigate ipl 2013 spot fixing

N Srinivasan, Indian Premier League, Spot Fixing, ipl2014 sspot fixing, Mudgal committee, Supreme Court

The Supreme Court will name a fresh committee that will investigate the 2013 Indian Premier League spot-fixing and betting scandal on Friday.

శ్రీనివాసన్ తో సహా అందర్ని విచారించండి

Posted: 05/17/2014 10:20 AM IST
Mudgal committee to investigate ipl 2013 spot fixing

క్రికెట్ ప్రపంచాన్ని తనదైన శైలిలో ఏలుతున్న బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. గత ఏడాది ఐపీఎల్ సీజన్లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారానికి సంబంధించి ఈ మాజీ బీసీసీఐ అధ్యక్షడితో పాటు 12 మంది క్రికెటర్ల పై విచారాణ జరపాలని ఫిక్సింగ్ వ్యవహారం పై ఏర్పాటు అయిన ముద్గల్ కమిటీకి జస్టిస్ పట్నాయక్ నేత్రుత్వంలోని ధర్మానం ఆదేశించింది.

దీనికి సంబంధించిన విచారణను బీసీసీఐ కమిటీతో విచారణ జరిపిస్తామన్న బీసీసీఐ ప్రతిపాదనను కోర్టు తోసి పుచ్చుతూ, విచారణను ఆగష్టు చివరి లోపు పూర్తి చేసి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ కమిటీకి సహాయంగా ఐపీఎస్ మాజీ అధికారి బీబీ మిశ్రా ఉండనున్నారు. అలాగే ముంబై, చెన్నై, ఢిల్లీల నుంచి ఒక్కో సీనియర్ పోలీస్ అధికారి సేవలు కూడా తీసుకోనున్నారు.

అలాగే వీరితో పాటు ఓ మాజీ క్రికెటర్‌ను ముద్గల్, మిశ్రా ఎంపిక చేసుకోనున్నారు.ఈ కేసుకు సంబంధించిన విచారణ సాగినంత కాలం ఒక్కో రోజుకు రూ.లక్ష ఇవ్వడంతో పాటు అన్ని ఖర్చులను బీసీసీఐ భరించాల్సి ఉంటుంది. బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్‌లపై విచారణకు ముద్గల్ కమిటీనే నియమించడంపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిత్య వర్మ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విచారణ అనంతరం శ్రీనివాసస్ శిక్ష తప్పదని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles