Michael clarke gets his hands on the icc test mace

michael clarke, icc, test rankings, international cricket, australia, cricket, ODI ranking,

Australia captain Michael Clarke today got his hands on the Reliance ICC Test mace.

క్లార్క్ చేతికి చేరిన ఐసీసీ టెస్ట్ ‘గద ’

Posted: 06/05/2014 03:37 PM IST
Michael clarke gets his hands on the icc test mace

పాంటింగ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగిన ఆస్ట్రేలియా జట్టు ఆ తరువాత వెనబడిపోయింది. 2009 తరువాత చెత్త ప్రదర్శనతో ర్యాంకుల పరంగా దిగజారిపోయిన కంగారులు ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన యాషెష్ సిరీస్ తో మళ్ళీ పుంజుకున్నారు. భారత జట్టు చెత్త ప్రదర్శన కారణంగా, ఆసీస్, మెరుగైన ప్రదర్శన కారణంగా భారత్ ని వెనక్కి నెట్టి,  చాలా రోజుల తరువాత మొదటి స్థానంలోకి వచ్చిన ఈ జట్టుకు ఐసీసీ నుండి అందే ‘గద ’ వెళ్లి పోయింది.

బ్రిస్బేన్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న అతను ఈ గదను అందుకున్నాడు. టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించిన జట్టుకు ఐసీసీ ఇచ్చే ఈ గదను 2009 తర్వాత ఆసీస్‌కు ఈ పురస్కారం దక్కడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆసీస్, దక్షిణాఫ్రికా 123 రేటింగ్ పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నా... దశాంశమానం తేడాతో కంగారుల జట్టుకు టాప్ ర్యాంక్ దక్కింది.

ఇక వన్డేల్లో భారత్ రెండో స్థానం నుండి మూడో స్థానాకికి పడింది. రెండో స్థానంలోకి శ్రీలంక జట్టు రాగా, మొదటి స్థానంలో ఆస్ట్రేలియా కొనసాగుతుంది. బ్యాట్స్ మెన్స్ బాబితాలో కోహ్లీకి అగ్ర స్థానం దక్కింది. ధోని శిఖర్ ధావన్ లు ఆరు ఏడు స్థానాలను దక్కించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles