Rohit sharma creates history by 264 runs in oneday innings against srilanka match

rohit sharma news, rohit sharma double century, rohit sharma 264 runs, rohit sharma latest news, rohit sharma srilanka match, rohit sharma photos, india vs srilanka, india vs srilanka oneday matches, virat kohli, indian cricketers

rohit sharma creates history by 264 runs in oneday innings against srilanka match

రోహిత్ రోర్స్ అగైన్... సరికొత్త వరల్డ్ రికార్డును నమోదు!

Posted: 11/13/2014 07:27 PM IST
Rohit sharma creates history by 264 runs in oneday innings against srilanka match

భారత యంగ్ క్రికెటర్ రోహిత్ శర్మ ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. ఇంతవరకు ఏ ఆటగాడు చేయలేని స్కోరును చేసి.. తన ఖాతాలో జమ చేసుకున్నాడు. గతంలో తాను చేసిన డబుల్ సెంచరీ రికార్డును మళ్లీ తానే బద్దలు కొట్టుకున్నాడు ఈ యంగ్ హీరో! ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే... యావత్ ప్రపంచవ్యాప్తంగా వున్న ఆటగాళ్లందరిలోనూ రెండుసార్లు డబుల్ సెంచరీ చేసినవాళ్ళు ఇంతవరకు ఎవ్వరూ లేరు.. కానీ ఆ రికార్డును కూడా ఈ డైనమిక్ హీరో అద్భుతమైన రీతిలో స్మాష్ చేసేశాడు.

భారత్ - శ్రీలంక మధ్య ఐదువన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఇప్పటికే 3-0 తో సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో నాలుగో వన్డేలోనూ తన జోరును కనబరిచింది. ఇతర ఆటగాళ్లు తమ బ్యాటుకు అంతగా పనిచెప్పలేదు కానీ.. రోహిత్ మాత్రం మైదానంలో వున్న క్రికెట్ అభిమానులతోపాటు ఫీల్డింగ్ చేస్తున్న లంక ఆటగాళ్లకు పట్టపగలే చుక్కలు చూయించేశాడు. డబుల్ సెంచరీతో దుమ్ము దులిపేశాడు. కేవలం 148 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 22 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో రెండో శతకాన్ని పూర్తి చేశాడు. మొదట్లో అర్థసెంచరీ చేయడానికి చాలా సమయం తీసుకున్న రోహిత్.. ఆ తరువాత పదునైన షాట్లతో తన బ్యాటుకు పనిచెప్పాడు.

100 బంతుల్లో సెంచరీ చేసిన రోహిత్.. ఆ తర్వాత సెంచరీ చేయడానికి కేవలం 50 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. దీంతో ఈ సెంచరీతో రోహిత్ వన్డేల్లో రెండో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడుగా నిలిచిపోయాడు. గతంలో 209 పరుగులు చేసిన రోహిత్.. ఈసారి తన జూలు విదిల్చి.. ప్రపంచంలో ఏ దిగ్గజ ఆటగాడు సాధించలేని అరుదైన ఘనతను సాధించాడు. కేవలం 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్స్ సహాయంతో ఏకంగా 264 పరుగులును పూర్తి చేసి.. చివరి బంతికి ఔటయ్యాడు. గతంలో సెహ్వాగ్ పేరిట వున్న 219 రికార్డును ఈసారి రోహిత్ భారీగా బద్దలుకొట్టి.. ప్రపంచ వన్డే చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles