Sachin tendulkar honoured by guinness world records on 60th anniversary

sachin tendulkar, sachin tendulkar latest news, sachin tendulkar guinness world records, guinness book of world records, sachin tendulkar records, sachin tendulkar awards, sachin tendulkar wiki

Sachin Tendulkar Honoured by Guinness World Records on 60th Anniversary

భారత క్రికెట్ లెజెండ్’కు మరో అపురూప గౌరవం...

Posted: 12/15/2014 05:16 PM IST
Sachin tendulkar honoured by guinness world records on 60th anniversary

క్రికెట్ జగత్తులో ఇంతవరకూ ఏ ఆటగాడు సొంతం చేసుకుని రికార్డులకు సచిన్ సృష్టించిన విషయం అందరికీ విదితమే! అయితే ఆయన క్రికెట్ రంగం నుంచి తప్పించుకుని చాలాకాలం అయినప్పటికీ.. రికార్డులు మాత్రం ఆయన్ను వదిలిపెట్టడం లేదనిపిస్తోంది. ఇంకా ఆయనకు ఏదో ఒక రూపంలో గౌరవాలు దక్కుతూనే వున్నాయి. మొన్నటికి మొన్న తన కలంతో ప్రపంచవ్యాప్తంగా సరికొత్త సంచలనాలు సృష్టించిన ఈ లెజెండ్.. తాజాగా మరో గౌరవాన్ని తన ఖాతాలో జమచేసుకున్నాడు.

గిన్నిస్ బుక్ సంస్థ ఇప్పటికీ ఏర్పడి 60 ఏళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో తన 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సంస్థ 60 మంది విఖ్యాత అథ్లెట్లను గౌరవించాలని నిర్ణయం తీసుకుంది. ఆ గౌరవంలో భాగంగా వారందరికీ ఓ సర్టిఫికెట్, ఓ మెడల్’ను ప్రదానం చేస్తారు. ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ 60 మంది విఖ్యాత అథ్లెట్ల జాబితాలో సచిన్ పేరు కూడా వుంది. ఈ విషయం తెలిసుకున్న సచిన్.. దీనిపై తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ విషయమై సచిన్ మాట్లాడుతూ.. తనకు గిన్నిస్ బుక్ వార్షికోత్సవ వేడుకల్లో చోటు కల్పించడం సంతోషదాయకమన్నాడు.

మరోవైపు.. గిన్నిస్ బుక్ ఎడిటర్ ఇన్ చీఫ్ గ్లెన్ డే మాట్లాడుతూ సచిన్ టెండూల్కర్ పై ఏకంగా ప్రశంసల వర్షాన్నే కురిపించేశారు. సచిన్ భారత్ కు చెందిన అత్యంత ప్రముఖుడని, ఎన్నో రికార్డులు నమోదు చేశాడని పేర్కొన్నారు. భారత్ లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అతడో స్ఫూర్తిప్రదాత అని కితాబిచ్చారు. సచిన్ లాంటి అద్భుతమైన క్రీడాకారుడు ఇండియాకు దక్కడం ఎంతో గౌరవమని, అలాగే ఆయనకు గౌరవం ప్రదానం చేయడం తమకూ ఎంతో సంతోషంగా వుందని ఆయన పేర్కొన్నారు.

24 ఏళ్ల క్రికెట్ కెరీర్’లో సచిన్ ఇంతవరకూ ఎన్నో ఇన్నింగ్స్ ఆడటంతోబాటు ఏ ఆటగాడు సాధించని పరుగులు, రికార్డులు సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్’లో 200 పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా పేరుగాంచాడు. ఇక పరుగుల విషయంలోనూ ఇతనే ముందున్నాడు. 100 సెంచరీలు చేసిన ఆటగాడిగానూ ప్రఖ్యాతి గాంచాడు. ఇలా లెక్కగడితే.. బహుశా ఈ ఆర్టికల్ సరిపోదు! ఇన్నీ రికార్డులు నమోదు చేసుకున్న నేపథ్యంలోనే సచిన్’ను గౌరవించాలని గిన్నిస్ బుక్ నిర్ణయించింది. దటీజ్ సచిన్ టెండూల్కర్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  guiness book of world records  telugu news  

Other Articles