భారత్ తో వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించిన అస్ట్రేలియా జట్టు.. మూడో టెస్టు కోసం సమాయత్తం అవుతున్న సమయంలో వారిని గాయాలు వెంటాడుతున్నాయి. ఒక వైపు టెస్టు మ్యాచ్ సీరీస్ ల ప్రారంభానికి ముందు తమ సహచర ఆటగాడు ఫిలిప్ హ్యూస్ గాయంలో అసస్మారక స్థితికి చేరుకున్ని మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన అసీస్.. తాజాగా బౌన్సర్లంటేను జంకుతున్నారు. అసీస్ జట్టును ఫిల్ హ్యూస్ ఘటన చాలా కుంగదీసింది. ఈ ప్రభావం తొలి రెండు టెస్టులపై పడకపోయినా.. క్రమంగా మూడు, నాల్గవ టెస్టులపై పడనుంది.
మూడవ టెస్టు ప్రాక్టీసు సమయంలో నిన్న జరిగిన ఘటన వారిని మరింతగా కలవారినికి గురిచేసింది. అసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ మూడో టెస్టు కోసం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ లో ప్రాక్టీసు చేస్తున్న క్రమంలో వాట్సన్.. జేమ్స్ పాటిన్ సన్ వేసిరిన బౌన్సర్ బంతి జోరుగా వచ్చి హెల్మెట్ పై తగిలింది. దీంతో ఆయన అక్కడే కిందపడ్డాడు. వెంటనే రంగంలోకి దిగిన అస్ట్రేలియా జట్టు వైద్యుడు పీటర్ బ్రుకనర్ వచ్చి వాట్సన్ ను ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అతను కొలుకున్నా.. గాయాం అతన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో ఆట నుంచి నిష్కమించాడు.
తాజాగా షాన్ మర్ష్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మెల్ బోర్న్ టెస్టు కోసం ప్రాక్టీసు చేస్తున్న క్రమంలో గాయపడ్డాడు. జోష్ హసిల్ వుడ్ విసిరిన బంతి అతిని చేతికి తగలడంతో త్రీవగాయమైంది. గాయం కాగానే కొద్ది సేపటివరకు నొప్పిని ఓర్చుకున్న మార్ష్.. ఆ తరువాత ఆటను కొనసాగించడానికి ఇబ్బంది పడ్డాడు. అతని ఎడమ చేతిపై బలమైన గాయమైంది. దీంతో అతను కూడా మూడో టెస్టుకు అందుబాటులో వుంటాడా లేదా అన్నది అనుమానంగానే చెబుతున్నారు. ఇప్పటికే గాయం కారణంగా ఫామ్ లో లేని మైకిల్ క్లార్ జట్టు నుంచి తప్పుకున్నాడు. మొత్తానికి అస్ట్రేలియా జట్టును గాయాలు వెంటాడతున్నాయని స్పష్టమవుతోంది. కాగా గాయం కారణంగా టెస్టు మ్యాచ్ లకు దూరంగా వున్న డేవిడ్ వార్నర్ జట్టులోకి వచ్చేందుకు పూర్తి ఫిట్ గా వుండటం జట్టు సభ్యులకు కొంత ఊరటనిస్తోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more