Arch rivals not a big threat to india in world cup

pakistan not a big threat to india, Former skipper mohammad azharuddin, ODI World Cup, Mohammad Azharuddin, India vs Pakistan, Cricket World Cup, Bhuvneshwar Kumar, no serious threat from arch-rivals, team india need consistancy, mohammad azharuddin, icc cricket world cup 2015, cricket world cup

Former skipper mohammad azharuddin doesnt see pakistan as big threat to india in world cup opener

వారిపై టీమిండియాదే ఎప్పటికే పైచేయి.. రికార్డులూ అదే చెబుతున్నాయ్..

Posted: 02/06/2015 06:20 PM IST
Arch rivals not a big threat to india in world cup

టీమిండియా-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందంటేనే సర్వత్రా ఆసక్తి.  ప్రత్యర్థి పాకిస్థాన్ తో టీమిండియా తలపడుతుందంటేనే ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. అయితే ఇప్పటి వరకూ వరల్డ్ కప్ లో పాక్ పై టీమిండియాదే పైచేయి సాధించి తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది.  ఇరు జట్లు తలపడిన మూడుసార్లు టీమిండియానే జయకేతనం ఎగురవేసి స్పష్టమైన ఆధిక్యాన్ని కల్గి వుంది. ఈ సారి కూడా టీమిండియా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ  కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. 'ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఎప్పుడూ ఆసక్తికరమే.  

వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో జరిగిన  మ్యాచ్ ల్లో టీమిండియా ఒక్కటి కూడా చేజార్చుకోలేదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహజసిద్ధంగా ఆడితే చాలు. దీనికోసం పెద్దగా వర్రీ చెందాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్ మ్యాచ్ ను సీరియస్ గా తీసుకోవద్దు' అని టీమిండియాకు అజహార్ సూచించాడు. ఫిబ్రవరి 15వ తేదీన అడిలైడ్ లో పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో భారత్ కు పెద్దగా సమస్యలు ఉండకపోయినా.. తరువాత మ్యాచ్ ల్లో మాత్రం జాగ్రత్త వహించాల్సిందేనన్నాడు.  తొలుత టీమిండియా ఎక్కువ మ్యాచ్ లను గెలిచి తగినంత నమ్మకాన్ని ప్రోది చేసుకోవాలని అజహార్ తెలిపాడు.


జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket-world cup-2015  mohammad azharuddin  Team india  

Other Articles