ఐసీసీ వరల్డ్ కప్ ఢిపెండింగ్ చాంఫియన్ టీమిండియా ప్రాక్టీసు మ్యాచ్ లోనూ బోక్కబోర్లా పడింది. అసీస్ చేతిలో చిత్తుగా ఓడింది. కంగారులు నిర్ధేశించిన లక్ష్యాన్ని చేధించడంలో చతికిలపడింది. అసీస్ నిర్దేశించిన 372 భారీ లక్ష్యాన్ని ఛేదించటంలో భారత్ 45.1 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (59), రహానె (66), రాయుడు (53) తప్ప మిగతా బ్యాట్స్ మెన్ అందరూ చేతులెత్తేశారు. కోహ్లి (18), రవీంద్ర జడేజా (20) మినహా ఎవరు రెండంకెల స్కోరు కూడా చేయలేదు. ఓ దశలో 154/2 గా ఉన్న భారత్ మరి కాసేపట్లో.. 185/7 కు చేరుకుంది. శిఖర్ ధావన్ అవుటయిన తరువాత భారత్ ఏ దశలోనూ కోలుకునే పరిస్థితి కనిపించలేదు.
ఆసీస్ బౌలర్లు కీలక సమయాల్లో వరుస వికెట్లు తీసి భారత్ను దెబ్బతీశారు. కమ్మిన్స్ మూడు, హాజిల్ వుడ్, జాన్సన్, స్టార్క్ రెండేసి వికెట్లు పడగొట్టారు. స్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్టేలియా 372 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. ఆదిలో ఫింఛ్(20)వికెట్ ను కోల్పోయినా.. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(104) పరుగులు చేసి శుభారంభం ఇచ్చాడు. దీంతో తరువాత రెచ్చిపోయిన ఆసీస్ ఆటగాళ్లు దూకుడుగా ఆడి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఆసీస్ ఆటగాడు మ్యాక్స్ వెల్(122;57 బంతుల్లో 11ఫోర్లు,8 సిక్స్ లు ) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. అయితే మ్యాక్స్ వెల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగడంతో ఆసీస్ స్కోరు బోర్డు కాస్త మందగించింది.
ఓ దశలో నాలుగు వందల మార్కును దాటుతుందనే భావించిన ఆసీస్ కు.. మ్యాక్ వెల్ స్టేడియానికి పరిమితం కావడంతో కాస్త జోరు తగ్గింది. వార్నర్, మ్యాక్స్ వెల్ లకు తోడు జార్జ్ బెయిలీ(44) పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. దీంతో ఆసీస్ 48.2 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటయ్యింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీకి మూడు వికెట్లు లభించగా, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మలకు తలో రెండు వికెట్లు దక్కాయి.
.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more