ప్రపంచ కప్ 2015 టోర్నమెంటులోని చిట్ట చివరి లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్ ఐర్లాండ్ పై 7 విక్కెట్లతో విజయాన్ని నమోదు చేసుకుంది. కీలక చివరి లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్.. ఐర్లాండ్పై విజయం సాధించి క్వార్టర్స్లో ప్రవేశించింది. ఐర్లాండ్ ఓటమితో వెస్టిండీస్ కూడా ఊపిరి పీల్చుకుంది. నాకౌట్ రేసులో ఐర్లాండ్ పోటీపడినా విండీస్ మెరుగైన రన్రేట్తో బెర్తు కొట్టేసింది. గ్రూపు-బిలో పాక్ 8 పాయింట్లతో మూడో స్థానంలో.. విండీస్ (6), ఐర్లాండ్ (6) వరుసగా 4, 5 స్థానాల్లో నిలిచాయి. ఐర్లాండ్తో ఆదివారం జరిగిన ఆఖరి లీగ్లో పాకిస్థాన్ 7 వికెట్లతో విజయం సాధించింది. 238 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్ 46.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. సర్ఫరాజ్ (101 నాటౌట్), షెహజాద్ (63), మిస్బా (39) రాణించి జట్టును సునాయాసంగా గెలిపించారు. సర్ఫరాజ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ ను పాక్ బౌలర్లు కేవలం 237మ పరుగలకే అలౌట్ చేశారు. అడిలైట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ కెప్టెన్ పోర్టర్ఫీల్డ్ (107) సెంచరీతో్ రాణించి జట్టును ఆదుకున్నాడు. పోర్టర్ ఫీల్డ్ అవుట్ కాగానే ఇతర ఐర్లాండ్ బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఐర్లాండ్ను కట్టడి చేశారు. పాక్ బౌలర్లు సొహైల్ ఖాన్, రహత్ అలీ, వాహబ్ రియాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more