Pakistan pacer mohammad irfan injured australia quarter finals match

mohammad irfan, pakistan pacer mohammad irfan, pakistan cricket team, icc world cup 2015, australia cricket team, pakistan vs australia, pakistan vs australia quarter finals match

pakistan pacer mohammad irfan injured australia quarter finals match : Pakistan pacer mohammad irfan will stay away from quarter finals in world cup against australia match.

పాకిస్తాన్ జట్టుకు అప్పుడే ఎదురుదెబ్బ..

Posted: 03/17/2015 04:44 PM IST
Pakistan pacer mohammad irfan injured australia quarter finals match

ప్రపంచకప్ టోర్నమెంట్ లో భాగంగా ఎంతో కష్టపడి క్వార్టర్స్ కు చేరిన పాకిస్థాన్ జట్టుకు కాస్త ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 20వ తేదీన ఆస్ట్రేలియాలతో తలపడనున్న పాక్ జట్టు నుంచి కీలక పేస్ బౌలర్ దూరమయ్యాడు. తన ఎత్తును చూపి ప్రత్యర్థి ఆటగాళ్లను భయపెట్టే ఆ పాక్ బౌలర్ పేరు మహ్మద్ ఇర్ఫాన్.

ఏడు అడుగుల ఒక అంగుళం మేర ఎత్తు వున్న ఇర్ఫాన్.. ప్రస్తుత వరల్డ్ కప్ టోర్నీలో అత్యంత పొడగరిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ లీగ్ లో 5 మ్యాచులు ఆడిన అతగాడు 8 వికెట్లు తీశాడు. అయితే.. ప్రస్తుతం పొత్తి కడుపులో నొప్పి కారణంగా తదుపరి మ్యాచ్.. అంటే క్వార్టర్ లో ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్ కి ఇర్ఫాన్ దూరంగా వుంటాడని పాక్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. కీలక సమయంలో ఇతను ఇలా అనారోగ్య బారిన పడటం పాక్ అభిమానులు ఆందోళనల్లో మునిగిపోయారు.

మరోవైపు ఇర్ఫాన్ అందుబాటులో లేకపోవడం వల్ల పీసీబీ కాస్త టెన్షన్ లో పడిపోయింది. అయితే.. క్వార్టర్ లో పాకిస్థాన్ గెలిస్తే.. సెమీ ఫైనల్లో ఇతను అందుబాటులో వుంటాడని అంటున్నారు. మరి.. ఆస్ట్రేలియాతో పాక్ ఎలా ఎదుర్కుంటుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles