world cup the hot topic in all the countries, newzealand vs Australia

Newzealand or australia who will win the world cup

michael clarke, New zealand vs Australia, New zealand versus Australia final, ICC Cricket World Cup 2015 final match, world cup final live updates, cricket world cup final scores, icc cricket world cup finals, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, New zealand, New zealand CWC 2015, Sports, World Cup Live

out of 14 nations which fought to go to finals.. at last the two host countries and arch rivals australia and newzealand

మరికొన్ని గంటల్లో అతిధ్య జట్ల మధ్య మహా సంగ్రామం..

Posted: 03/28/2015 05:39 PM IST
Newzealand or australia who will win the world cup

ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో రెండు అతిధ్య జట్లు.. అదీకాకా దాయాది దేశాల మధ్య జరుగునున్న మహా సంగ్రామంలో ఎవరిది పై చేయి. మెల్ బోర్న్ వేదికగా జరుగనున్న సమరంలో జగజ్జేతగా నిలిచేదెవరో.. ఈ పోరులో ఓటమిని అంగీకరించేంది ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. సెమీ ఫైనల్ లో భారత్ ఓటమితో ఇంటి ముఖం పట్టినా.. ఫైనల్ గా విశ్వవిజేతగా ఎవరు నిలుస్తారు అన్న అంశాలపై మాత్రం సర్వత్రా ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తుతున్నాయి. గ్రాండ్ ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకునేందుకు సన్నధం అవుతున్నాయి. ఆసీస్ ఐదోసారి ప్రపంచ కప్ సాధించాలని ఆరాటపడుతుండగా, కివీస్ తొలిసారి ప్రపంచ చాంపియన్ కావాలని ఉవ్విళ్లూరుతోంది

వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా హైరిస్క్ అప్రోచ్ నే కంటిన్యూ చేస్తామని అంటున్నాడు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండెన్ మెకల్లమ్‌. గతంలో సెమీస్ వరకూ వచ్చి చతికిలబడిన సందర్భాలను మెకల్లమ్‌ గుర్తు చేసుకున్నాడు. వరల్డ్ కప్ 2015లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తూ ఫైనల్ కు వచ్చామని.. ఫైనల్లో కూడా అదే తరహా ఆటను కనబరిచి  కప్ ను గెలవడానికి యత్నిస్తామన్నాడు. కప్ గెలవడానికి ఇరు జట్లకు 50-50 ఛాన్స్ ఉందన్నాడు. 1992 సెమీ ఫైనల్లో తమ ఆశలను పాకిస్థాన్ ఆటగాడు ఇంజమామ్ హక్ కొల్లగొట్టాడన్నాడు. ఈసారి మాత్రం కప్పు గెలవడానికి తుదికంటూ పోరాడతామన్నాడు. వేగంగా ఆడటమే తనకు తెలిసిన విద్యని ఒక ప్రశ్నకు సమాధానంగా మెకల్లమ్‌ తెలిపాడు.

ఇదిలావుండగా ఈ రెండు జట్లు లీగ్ ధశలో ఒకే పూల్ ( గ్రూప్ ఎ) లో అడాయి. న్యూజీలాండ్ వరుసగా ఎనమిది మ్యాచ్ లను గెలిచి త్రిబుల్ హ్యాట్రిక్ కోసం ఆరటపడటంతో పాటు తొలిసారిగా ప్రపంచ కప్ ను అందుకోవాలని తీవ్రంగా శ్రమిస్తుండగా, అస్ట్రేలియా మాత్రం ఐదోసారి ప్రపంచ కప్ అను అందుకోవాలని ఆరాటపడుతోంది. అయితే లీగ్ దశలో న్యూజీలాండ్ చేతిలో ఓటమిని చవిచూసిన పరాభవం నుంచి అసీస్ ఆటగాళ్లు కోలుకున్నా.. ఆ ఓటమి గాయాలు మాత్రం మర్చిపోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న మ్యాచ్ ఎవరిని విశ్వవిజేతగా నిలుపుతుందో వేచి చేడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  New zealand  Australia  michael clarke  retirement  

Other Articles