భారత క్రికెటర్ సురేశ్ రైనా వరుడయ్యాడు. తన చిన్నానటి స్నేహితురాలు ప్రియాంక చౌదరిని అర్థాంగిని చేసుకోనున్నాడు. ప్రస్తుతం ప్రియాంక నెదర్లాండ్స్‌లో ఉద్యోగం చేస్తోందని సమాచారం. శుక్రవారం సాయంత్రం లీలా ప్యాలెస్ హోటల్లో రైనా...ప్రియాంకలు పెద్దలు, అతిధులు, బంధుమిత్రుల మధ్య హిందూ వైవాహిక ఆచారాల ప్రకారం ఒక్కటవ్వనున్నారు. సంప్రదాయాల ప్రకారం జరగనున్న ఈ వివాహ వేడుక కోసం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ సిబ్బంది అన్ని ఏర్పాటు చేయగా, అప్పుడే అతిధులు విచ్చేస్తున్నారు.
నిన్ననే ఘజియాబాద్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. కాగా, ఈ స్టార్ క్రికెటర్ నిన్న రాత్రి వరకు షాపింగ్ చేస్తూనే ఉన్నాడు. వరల్డ్ కప్ ముగించుకుని భారత్ చేరిన కొన్నిరోజుల్లోనే పెళ్లికి వెళ్తుండడంతో.. సమయాభావదం వల్ల షాపింగ్ కూడా పూర్తికాలేదని అందుచేతే బుధవారం వరకు షాపింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పుకోచ్చాడు. త్వరలోనే ఐపిఎల్ ప్రారంభం కానున్న తరుణంలో ఐపీఎల్ కు వచ్చే సహచర క్రికెటర్లతో పాటు టీమిండియా క్రికెటర్లు, రాజకీయ నేతలు పలువురు బాలీవుడ్ సెలబ్రీటీలు కూడా వివాహానికి హాజరవుతున్నారని సమాచారం. విరాట్. కోహ్లి, అనుష్క ఇప్పటికే ఢిల్లీ చేరారు. ఉమేశ్ యాదవ్ కూడా భార్యతో పాటు ఢిల్లీ చేరుకున్నాడు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more