BCCI in safe hands with Jagmohan Dalmiya at helm: Sourav Ganguly

Bcci safe hands with jagmohan dalmiya at helm says sourav ganguly

Sourav Ganguly on cricket, Sourav Ganguly on jagmohan dalmia, Sourav Ganguly on bcci, BCCI in safe hands, jagmohan dalmiya at helm, ganguly on IPL, IPL spot-fixing scandal, Jagmohan Dalmiya, former India captain Sourav Ganguly

In the aftermath of the IPL spot-fixing scandal the BCCI may have been shrouded by controversy but with Jagmohan Dalmiya back as president the Indian cricket board is in "safe hands", former India captain Sourav Ganguly said

ఆయన చేతుల్లోనే బీసీసీఐ చాలా సేఫ్

Posted: 04/03/2015 08:03 PM IST
Bcci safe hands with jagmohan dalmiya at helm says sourav ganguly

భారత క్రికెట్ బోర్డులోకి జగ్ మోహన్ దాల్మియా  తిరిగి రావడం పట్ల భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణాలతో క్రికెట్ బోర్డు పరువు ప్రతిష్టలకు భంగం కలిగిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ జగ్ మెహన్ దాల్మియా తిరిగి అధికారానని చేపట్టంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు బీసీసీఐ సురక్షితులైన వ్యక్తి చేతుల్లో ఉందంటూ శుక్రవారం గంగూలీ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణాలు, భారత ఆటగాళ్లు, ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఇందులో భాగస్వాములవ్వడం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని వివాదాల్లోకి నెట్టిన విషయాలను ఆయన గుర్తు చేశారు. తొమ్మిదేళ్ల విరామం తర్వాత దాల్మియా చాలా నాటకీయ పరిణామాల మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా తిరిగి ఎంపికయ్యారు.

జగ్ మోహన్ ధాల్మియాను చూసి తామెంతో గర్విస్తున్నామని చెప్పారు. బీసీసీఐ అధ్యక్షుడిగా లేకపోయినా ఆయనంటే తమకు గౌరవం, ప్రేమ ఉన్నాయన్నారు. భారత క్రికెట్ ను ఆయన మరింత ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షించారు. జగ్ మోహన్ దాల్మియా రాకతో టీమిండియా చాలా సేఫ్ హ్యాండ్స్ లో ఉంటుంది' అని గంగూలీ వ్యాఖ్యానించాడు. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగిన దాల్మియా క్రికెట్ బోర్డును లభాల బాటలో నడిపించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket  Marriage  Team India  sourav ganguly  

Other Articles