ఐపీఎల్-8 సీజన్ లోనూ ధోనీసేన తన జైత్రయాత్రను కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తమ అధ్భుత బ్యాటింగ్ తో పరుగుల వర్షాన్ని కురిపించే బ్యాట్స్ మెన్లు, దిగ్గజ ఆటగాళ్లను పవెలియన్ చేర్పించే బౌలర్లు, బ్యాట్స్ మెన్లను తన స్వింగ్ తో కన్ఫ్యూజ్ చేసే స్పిన్నర్లు, ఇక ధోనీలాంటి కూల్ కెప్టెన్ వుండటం వల్ల చెన్నై జట్టు అలవోకగా విజయాలబాటవైపు పరుగులు పెడుతోంది. అటువంటి ఈ ‘ఆల్-రౌండర్’ జట్టును ఢిల్లీ ముచ్చెమటలను పట్టించడమే కాకుండా ఓటమి ఎలా వుంటుందో రుచి చూపించింది.
ఐపీఎల్-8లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు చెన్నై మీద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఢిల్లీ బౌలర్ల ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు విలవిల్లాడారు. పరుగులు రాబట్టేందుకు బాగానే చెమటోడ్చారు కానీ ఫలితం దక్కలేదు. దీంతో ఈ జట్టు కేవలం 119 స్వల్ప పరుగులకే చాపచుట్టేసింది. టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకోగా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి చెన్నై 119 పరుగులు చేసింది. డుప్లెసిస్(29), ధోనీ(27) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్లు ఢిల్లీ బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకే పవెలియన్ చేరారు. ఇక ఢిల్లీ బౌలర్ల విషయానికొస్తే.. జహీర్ ఖాన్, అల్బీ మోర్కెల్ పదునైన బౌలింగ్ తో చెలరేగారు.
ఇక 120 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. 16.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. ఢిల్లీ ఓపెనర్ శ్రేయాస్ అయ్యర్ మరోసారి చెలరేగాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్స్ సహాయంతో అతగాడు 70 పరుగులు సాధించాడు. ఇక అత్యంత ఖరీదైన ఆటగాడు యువరాజ్(32) కూడా రాణించడంతో ఢిల్లీ విజయం సాధించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more