Chris Gayle Raise His Bat On Yuvraj Singh | IPL 8 season | Bangalore Stadium

Chris gayle raise his bat on yuvraj singh in ipl 8 season in bangalore stadium

yuvraj singh, chris gayle, bangalore stadium, delhi dare devils, bangalore royal challengers, virat kohli, AB de villiers, ipl 8 season

Chris Gayle Raise His Bat On Yuvraj Singh In IPL 8 season in Bangalore Stadium : One very interesting moment came across during the match when Yuvraj Singh jokingly pushed aside Chris Gayle while players from both teams were running for cover under the rain.

యువరాజ్ పై బ్యాటెత్తిన క్రిస్ గేల్..

Posted: 05/18/2015 10:58 AM IST
Chris gayle raise his bat on yuvraj singh in ipl 8 season in bangalore stadium

ఐపీఎల్-8 సందర్భంగా ఆదివారం సాయంత్రం బెంగుళూరు మైదానంలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. నిండు మైదానంలో భారతీయ అభిమానుల ముందు కరేబియన్ ఆటగాడు క్రిస్ గేల్.. యువసంచలనం యువరాజ్ ను తన బ్యాటుతో బాదే ప్రయత్నం చేశాడు. కానీ.. యువీ తన తెలివితేటలతో ఆ దెబ్బ నుంచి తప్పించుకోగలిగాడు. అయితే.. వారిద్దరూ ఇలా దెబ్బలాడుకున్నది కోపంగా కాదులెండి.. సరాదా కోసమే!

అసలు జరిగిందేమిటంటే.. ఆదివారం బెంగుళూరులో ఐపీఎల్-8లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ లు ఢీకొట్టాయి. ఈ రెండు జట్లలో క్రిస్ గేల్ బెంగుళూరు జట్టు తరఫున ఆడుతుండగా.. ఢిల్లీ జట్టు సభ్యుడిగా యువీ ఆడుతున్న విషయం తెలిసిందే! ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో వర్షం రావడంతో నిలిచిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో ఇరుజట్ల ఆటగాళ్లు పిచ్ నుంచి వెనుదిరుగుతున్నారు. ఈ సందర్భంగానే గేల్, యువీల మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే గేల్ బ్యాటెత్తి యువీని కొట్టబోగా.. యువీ కూడా ఆ దెబ్బ నుంచి తప్పించుకుంటూ గెంతాడు. ఈ దృశ్యాన్ని వీక్షించిన అభిమానులు ఆసక్తిగా తిలకించారు.

ఇదిలావుండగా.. వర్షం రావడంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. దీంతో అంపైర్లు ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. నెట్ రన్ రేట్ లో బెంగుళూరు జట్టు మెరుగ్గా వుండటంతో అది ప్లేఆఫ్ కు వెళ్లింది. ఢిల్లీ చేతిలో పరాజయాలు ఎక్కువగా వున్న నేపథ్యంలో అది ఇంటిబాట పట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yuvraj singh  chris gayle  virat kohli  

Other Articles