Bangladesh speedster Rubel Hossain acquitted in sexual assault case

Bangladesh cricketer rubel hossain acquitted in sexual assault case

Cricket, Rubel Hossain, Naznin Akter Happy, ICC World Cup 2015, sexual assault, Bangladesh cricketer, acquitted, sexual assault case, Bangladesh court, film actress Naznin Akter Happy, Dhaka's Fifth Women and Child Repression Prevention Tribunal

A Bangladesh court threw out sexual assault charges filed by film actress Naznin Akter Happy against national cricket team player Rubel Hossain, and acquitted him

మొత్తానికి హ్యాపీ.. అత్యాచార కేసు నుంచి బయటకీ..

Posted: 05/21/2015 06:24 PM IST
Bangladesh cricketer rubel hossain acquitted in sexual assault case

అత్యాచార కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హొసేన్కు విముక్తి లభించింది. అత్యాచార కేసులో అభియోగాలను ఎదుర్కోంటున్న రూబెల్ ను బంగ్లాదేశ్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. తనతో తొమ్మిది మాసాల పాటు సహజీవనం చేసి.. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిడంతో బంగ్లాదేశ్ నటి నజ్నీన్ అక్తర్ హ్యాపీ.. రూబెల్ పై కేసు వేసింది. కాగా ఈ కేసును విచారించిన ఢాకా కోర్టు బుధవారం రూబెన్ను నిర్దోషిగా ప్రకటించింది. రూబెల్పై నమోదైన అభియోగాలను కొట్టివేసింది. కేసుకు సంబంధించి బలమైన ఆధారలేమీ లేనందున ఢాకా ఐదవ మహిళా, శిశు అఘాయిత్యాల నిరోధక ట్రిబ్యూనల్ రూబెల్ ను నిర్దోషిగా విడుదల చేసింది.

పెళ్లి పేరుతో తనను నమ్మించి.. ప్రేమలోకి దింపి.. తనను అత్యాచారం చేశాడంటూ నజ్నీన్ రూబెల్పై కేసు పెట్టింది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ ముందు రూబెల్ను అరెస్ట్ చేశారు. తాజాగా కోర్టులో ఈ కేసు కొట్టివేయడంతో రూబెల్కు విముక్తి లభించినట్టయ్యింది. అయితే దీనిపై స్పందించిన నజ్నీన్ అక్తర్ హ్యపీ తరపు న్యాయవాది తుహిన్ హౌలాడర్.. ఈ కోర్టులో తమ వాదనలను పరిశీలించలేదని, అవసరమైతే ఢాకా హైకోర్టుకు కూడా వెళ్తమన్నారు. కాగా ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ ను ఓడించి తొలిసారి క్వార్టర్ పైనల్స్ వెళ్లేందుకు దోహదపడిన రూబెల్ పై తాను కేసును ఉపసంహరించుకుంటున్నాని హ్యాపీ అప్పుడే ప్రకటించారు. దీంతో బంగ్లా సీమర్ కు విముక్తి లభించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket  Rubel Hossain  Naznin Akter Happy  ICC World Cup 2015  sexual assault  

Other Articles