క్రికెట్ మైదానంలో బ్యాటుతో విరుచుకుపడి.. ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడి.. భారత్ క్రికెట్ టీమ్ నిజమైన పర్వతంగా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్.. తెరంగ్రేటం చేయబోతున్నారు. నమ్మశక్యం కావడం లేదా..? నిజమేనండి ధావన్ తెరంగ్రేటం ముమ్మాటికీ నిజమే. అయితే 70 ఎం ఎం సిల్వర్ స్ర్కీన్ పై కాకుండా.. బుల్లి తెరలో తెరంగ్రేటం చేయడానికి సిద్దమవుతున్నాడు. అదేంటి ధావన్ తలచుకుంటే.. 70 ఎంఎం చిత్రాలు తీయడానికి ఎందరో సిద్దంగా వుండివుంటారు. మరి అలా కాకుండా బుల్లితెరపై తెరంగ్రేటం చేయడం ఏందుకంటారా..? ఎందుకంటే అయన తన హీరోయిన్ గా తన భార్య అమేషాతో కలసి డాన్స్ అడేందుకు సిద్దమవుతున్నాడు కాబట్టి. ఓహ్ వాట్ యే న్యూస్ అంటారా.. నిజమే తన భార్యతో కలసి ధావన్ నటించడంతో పాటు డాన్స్ కూడా చేయబోతున్నారు.
స్టార్ ప్లస్ సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో 'నచ్ బలియే 7' వైల్డ్ కార్డ్ ఎంట్రీతో థ్రిల్ చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. స్పెషల్ వెల్డ్ కార్డ్ ఎంట్రీతో షోలో పాల్గొనాలని ధావన్, అయేషా దంపతులను సంప్రదించినట్టు షో నిర్వాహకులు వెల్లడించారు. వీరిద్దరూ డాన్స్ చేస్తే అదనపు ఆకర్షణ అవుతుందని పేర్కొన్నారు. 'నచ్ బలియే 7' రియాలిటీ షోను ఏక్తాకపూర్ నిర్మిస్తున్నారు. ఈసారి పోటీదారులందరూ ఒకే ఇంట్లో ఉంటారు. ప్రేక్షకులకు ఓటింగ్ చేసే అవకాశం లేదు. నటి ప్రీతి జింతా, రచయిత చేతన్ భగత్, కొరియోగ్రాఫర్ మార్జి పెస్టోన్జీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. అయితే క్రికెట్ గుడ్ బై చెప్పబోతున్నారా..? అన్న సందేహాలు కలుగుతున్నాయా..? అదేం లేదు. ధావన్ అటు టీమిండియాలో బ్యాట్ ను ఝళిపించడంతో పాటు ఇటు నచ్ బలియే లోనూ తన సత్తాను చాటనున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more