టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, టెస్టు క్రికెట్ కెప్టన్ విరాట్ కోహ్లీ.. ఈ నెల 7న బంగ్లదేశ్ టూర్ కు ప్రయాణమవుతున్న తరుణంలో అయన తన ప్రేయసి, ప్రియురాలు బాలీవుడ్ అందాల అమ్మడు అనుష్క శర్మతో కలసి ఢిల్లీలో షాపింగ్ చేస్తూ బిజిబిజీగా గడిపారు. తాజాగా అనుష్క శర్మ నటించిన దిల్ ధడకనే దో చిత్రం ప్రమోషన్ లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న అనుష్క శర్మ, చిత్ర యూనిట్ అందరూ ముంబాయికి వెనుదిరిగినా.. అమె మాత్రం ఢిల్లీలోనే మకాం వేసిందట. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ విరాట్ కోహ్లీతో పాటు అయన కుటుంబ సభ్యులతో సరదాగా గడపాడానికి టాక్.
అసలే ఇద్దరూ బిజీగా వుండే సెలబ్రిటీలు కాబట్టి.. అవకాశం లభించినప్పుడల్లా సరదాగా షికార్లు కోడుతున్నారట. ఢిల్లీలోని ఓ ఫుట్ వేర్ (పాదరక్షల) దుకాణంలో అనుష్క, విరాట్ షాపింగ్ చేస్తూ కనబడ్డారు. అయితే మన మీడియా ఊరుకుంటుంటుందా.. ఇద్దరు కలసి షాపింగ్ చేస్తున్నారహో.. అంటూ వార్తలను ప్రచురించడంతో.. విషయం బయటకు వచ్చింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు గుప్పుమన్న వార్తల్లో నిజం వుందో లేదో తెలియదు కానీ.. ఇద్దరికిద్దరు మాత్రం అలా ఫైర్ అయ్యి.. ఇలా చల్లబడతారనేది షాఫింగ్ ఘటనతో అర్ధమైంది.
ఈ సందర్భంగా వారిద్దరూ వేర్వేరుగా ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో ఒకరిపై మరోకరు పోగడ్తలను కుమ్మరించుకుంటున్నారు. విరాట్ తన ప్రియురాలు తనను బాగా అర్థం చేసుకుంటుందని, తనకు తెలియని విషయాలను తెలుసుకోవాలన్న అసక్తి అధికమని చెప్పుకోచ్చాడు. తనను కలిసే ముందు అనుష్కకు క్రికెట్ అంటే ఏమిటో తెలియదని, తనను కలిసిన తరువాత.. ఇప్పడు క్రికెట్ క్రీడ గురించి బాగానే తెలుసుకుందని విరాట్ చెప్పుకోచ్చాడు. ఏదేమైనా ఇద్దరికిద్దరూ మేడ్ వర్ ఈచ్ అదర్ అన్నటుగానే వున్నారు మరి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more