Sachin Tendulkar voted best Test player of 21st century: Cricket Australia poll

Sachin tendulkar voted best test player of 21st century

Sachin Tendulkar Voted Best Test Player of 21st Century, Best Test Players, Cricket Australia, Greatest Test Cricketers, Kumar Sangakkara, Sachin Tendulkar, Cricket, Team India, Sachin Tendulkar, Cricket Australia, India, online poll, 21 st century best test cricketer, cricket.com.au, Indian cricket legend Sachin Tendulkar

In an online poll conducted by Cricket Australia’s website, Indian cricketing legend Sachin Tendulkar has been voted the ‘Best Test player’ of the 21st century.

21 శతాబ్దపు బెస్ట్ టెస్టు ప్లేయర్ గా సచిన్ టెండుల్కర్ ఎన్నిక..!

Posted: 06/26/2015 06:23 PM IST
Sachin tendulkar voted best test player of 21st century

21వ శతాబ్దపు మేటి క్రికెట్ క్రీడాకారుడిగా భారత బ్యాటింగ్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డుకెక్కాడు. ఈ అవార్డును ఆయనకు ఇచ్చింది మరెవరో కాదు.. ప్రజలు. ముఖ్యంగా అస్ట్రేలియన్ క్రికెట్ అభిమానులు. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో సచిన్ టెండుల్కర్ ను ఈ శతాబ్ధపు మేటీ టెస్టు క్రికెటర్ గా ఎంపిక చేయబడ్డారు. ఆ వెబ్‌సైట్ తాజాగా 2000 సంవత్సరం తర్వాత టెస్ట్ క్రికెట్‌ మ్యాచ్‌లలో ప్రత్యేకతను చాటుకున్న 100 మంది క్రికెట్ క్రీడాకారుల పేర్లతో ఒక సర్వే నిర్వహించింది.
 
ఆ సర్వేలో భారత దేశానికి చెందిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 23 శాతం ఓటింగ్ పొంది తొలి స్థానంలో నిలిచారు. సుమారుగా 16 వేల మంది క్రికెట్ అభిమానులు ఈ పోల్ లో పాల్గొని తమ ఓటును వినియోగించారు. సచిన్‌కు తర్వాత రెండో స్థానంలో 14 శాతం ఓట్లతో శ్రీలంక క్రికెటర్ సంగక్కర, ఆస్ట్రేలియా క్రీడాకారుడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టాప్ టెన్ పట్టికలో సచిన్ మినహా మరే ఇతర భారత ఆటగాళ్లకు స్థానం లభించలేదు. ఈ జాబితాలో నలుగురు ఆస్ట్రేలియా క్రీడాకారులు, ముగ్గురు సౌత్ ఆఫ్రికా క్రికెటర్లు, ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు ఎంపికయ్యారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket  Team India  Sachin Tendulkar  Cricket Australia  India  

Other Articles