ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ మరో వివాదంలో చిక్కకున్నారు. క్రికెట్ రంగానికి సరికొత్త రూపురేఖలు గీసిన ఈయన ‘మనీ స్కామ్’ ఉచ్చులో బిగుసుకుపోయిన విషయం తెలిసిందే! ఈయన కుంభకోణం బయటపడినప్పటి నుంచి ఒక్కొక్క సంచలనం ఒక్కోసారి తెరమీదికొస్తోంది. ఈయనకు మద్దతు పలికిన మంత్రులుసైతం తమ పదువులు కోల్పోవాల్సి వస్తోంది. ఆ విషయాలు కాస్త పక్కనపెడితే.. మోదీ ట్విటర్ వేదికగా అప్పుడప్పుడు సంచలన ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఆమధ్య చెన్నై జట్టులో కీలక ఆటగాళ్లు ఫిక్సింగ్ కి పాల్పడ్డారని ట్వీట్ చేసి దుమారం రేపిన ఈయన.. తాజాగా రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్లు చేశారు.
రాష్ట్రపతి, ఆయన కార్యదర్శి ఒమితా పౌల్, వివేక్ నాగ్ పాల్ అనే వ్యాపారవేత్త ఫోటోను మోదీ ట్విటర్ లో పెట్టారు. ఇలా వారి ఫోటోలు పెడుతూ.. నాగ్ పాల్ రాష్ట్రపతి ఆర్థికమంత్రిగా వున్నప్పుడు తన నుంచి లబ్దిపొందారని లలిత్ ఆరోపించారు. అంతేకాదు.. గతంలో ప్రణబ్ ఆర్థికమంత్రిగా వున్నప్పుడు కొచ్చి ఫ్రాంచైజీలో వాదాటాదారుల పెట్టుబడుల గురించి ప్రశ్నించినందుకు ఆయన తనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు ఆదేశించారని అప్పట్లో ఆయన చేసిన ఆరోపణ తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదం వల్ల ఆ సమయంలో కేంద్రమంత్రి శశిథరూర్ తన పదవినుంచి నుంచి తప్పుకోవడం కూడా తెలిసిందే! అలా అప్పుడు సంచలన వివాదానికి తెరలేపిన మోదీ.. ఇప్పుడు ఆ తరహాలో మరోసారి రాష్ట్రపతిపై ట్విటర్ లో ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
లలిత్ మోదీ ఈ విధంగా ట్వీట్లు చేయడంపై రాష్ట్రపతి భవన్ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రతిష్టను దెబ్బతీసేలా మోదీ ట్వీట్ చేశాడని.. జూన్ 23, 25న ట్విటర్ లో పోస్ట్ అయిన చిత్రాలను, ఇతర వివరాలను ఫిర్యాదు కాపీతో ఢిల్లీ పోలీసు కమిషనర్ కు పంపింది. కాగా.. ఈ ఫిర్యాదును పోలీసు కమిషనర్ తదుపరి చర్యలకోసం ఆర్థికనేరాల విభాగానికి పంపినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ఐపీసీ కింద కేసు నమోదు చేయాలా లేక ట్విటర్ లో ఆ పేజీని బ్లాక్ చేయించడానికి స్థానిక కోర్టును ఆశ్రయించాలా అన్న దానిపై చర్చలు కొనసాగిస్తున్నారని సమాచారం!
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more