ధేశ రాజధాని దిల్లీలోని మీరాబాగ్ ప్రాంతానికి చెందిన విరాట్ విహార్ కాలని ప్రజలు టీమిండియా టెస్టు క్రికెట్ కెప్టెన్, భారత్ యువ సంచలన క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రాదేయపడుతున్నారు. అదేంటి భారత్ తరుపున ఆడుతున్న ఆయనను గల్లీ క్రికెట్ అడమని బతిమాలుకుంటున్నారా..? అన్న సందేహం రానీయకండా. ఎందుకంటే.. కోహ్లీని వారు ప్రాదేయపడుతున్నది.. తమ కాలనీ వదిలి వెళ్లవద్దని. ఇన్నాళ్లు విరాట్ కోహ్లి తమ కాలనీ వాడే అని అక్కడి వాళ్లు గర్వంగా చెప్పుకుంటూ వచ్చారు. అంతుకాదు విరాట్ తో అడపాదడపా కలిసేందుకు కాలనీ సంక్షేమ సంఘం పేరిట అనేక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. దీంతో కాలనీలోని యువత అందరితో విరాట్ సెల్పీలు, అటోగ్రాఫ్ లు ఫోటోలు ఇలా చాలానే వున్నాయి.
విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ ఇప్పుడు ఈ కాలనీ నుంచి గుడ్‌గావ్‌లోని కొత్త ఇంటికి వెళ్లిపోతుండటంతో వారి బాధ అంతా ఇంతా కాదు. ఇది తెలిసి విరాట్ విహార్ కాలనీలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి వల్లే మా కాలనీకి విరాట్ విహార్ అని పేరు వచ్చింది. భారత క్రికెట్ స్టార్ మా కాలనీలో ఉండటం మాకు గర్వకారణం. విరాట్ నిర్ణయం మాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలన్న నిర్ణయంపై కోహ్లి ఇంకోసారి ఆలోచించుకుంటే మంచింటూ కాలనీ వాసులు కోహ్లీతో పాటు ఆయన కుటుంబ సభ్యలను కూడా బతిమాలుతున్నారట. ఇక విరాట్ విహార్ కు చెందిన చిన్నారులైతే.. కోహ్లీని ఇక్కడి నుంచి వెళ్లనిచ్చేది లేదంటు తెగేసి చెబుతున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more