జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సీరిస్ లో భారత్ కైవసం చేసుకుంది. మూడు వన్డేలలో రెండు తొలి రెండు వన్డే మ్యాచ్ లను గెలిచిన ఇండియా.. మరో వన్డే మ్యాచ్ మిగిలివుండగానే సీరీస్ ను కైవసం చేసుకుంది. తొలి వన్డేలో ఉత్కంఠకర పోరును ఎదుర్కున్న టీమిండియా.. రెండో వన్డేలో సునాయసంగా, ఏకపక్షంగా అతిధ్య జట్టుపై గెలుపు సాధించింది. టీమిండియా జట్టులో సీనియర్లు ఎవరూ లేకున్నా..రహానే సేన మొక్కవోని విశ్వాసంతో సీరీస్ ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే జట్టను రహానే సేన 62 పరుగులతో ఓడించి రెండు విజయాలతో మూడ వన్డేల సీరీస్ ను కైవసం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్దేశించిన 272 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే అదిలోనే వికెట్లను కొల్పోయి కష్టాలు పడింది. ఓపెనర్ చమ్మూ చుబాబ్బా మినహా జింబాబ్వే ఆటగాళ్లు ఎవ్వరూ రాణించలేదు. చివరిలో జింబాబ్వే వికెట్ కీపర్ రిచ్ మండ్ ముటుంమబని 32 పరుగులతో స్కోరుబోర్డును ముందుకు నడిపించినా.. ఫలితం లేకపోయింది. మరో ఆరు బంతులు మిగిలి వుండగానే జింబాబ్వే అలౌట్ అయ్యింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ అత్యద్భుతంగా రాణించాడు. పది ఓవరల్లో 33 పరుగులిచ్చిన భువి నాలుగు విక్కెట్లను సాధించాడు. కాగా ధవల్ కుల్ కర్ణీ, హర్బజన్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, అక్షర్ పటేల్ లు తలా ఒక్కో విక్కట్ పడగొట్టారు. కాగా మరో రెండు కీలక విక్కెట్లను టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే రన్ అవుట్ రూపంలో పెవీలియన్ కు పంపించారు.
అంతకుముందు టీమిండియా.. అతిధ్య జట్టు ముందు 272 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. నిర్ణీత యాభై ఓవర్లలో టీమిండియా ఎనమిది విక్కెట్ల నష్టానికి 271 పరుగులు సాధించింది. టీమిండియా కెప్టెప్ అజింక్యా రహేనే.. సహా మురళి విజయ్ లు అద్భుతంగా రాణించి హాఫ్ సెంచరీలతో రాణించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే.. టీమిండియాను బ్యాటింగ్ బరిలోకి దింపింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఒపెనర్లు రహానే, మురళీ విజయ్ 112 పరుగుల వరకు విక్కెట్ కోల్పోకుండా శుభారాంబాన్ని ఇచ్చారు. 112 పరుగుల వద్ద కెప్టెన్ రహానే 63 పరుగుల వ్యక్తిగత స్కోర్‌కు వద్ద అవుట్ అయ్యి పెవీలియన్ కు చేరుకున్నాడు.
ఆ తరువాత బరిలోకి వచ్చిన అంబటి రాయుడుతో కలసి మురళీ విజయ్ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. ఈ క్రమంలో 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మురళీ విజయ్ కూడా వెనుదిరిగాడు. తొలి వన్డేలో శతకాన్ని బాదిన తెలుగు తేజం అంబటి రాయుడు ఈ మ్యాచ్ లోనూ 41 పరుగులు సాధించి ఔటయ్యాడు. ఆ తరువాత భారత్ క్రమంగా విక్కెట్లను కోల్పయింది. మనోజ్ తివారీ 22 పరుగులు, రాబిన్ ఉత్తప్ప 13 పరుగులు, కెదర్ జాదవ్ 16 పరుగులతో వెనుదిరిగారు. తొలివన్డేలో అంబటిరాయుడితో జతకట్టి రాణించిన స్టువర్ట్ బిన్నీ కూడా 25 పరుగులకే వెనుదిరిగాడు.
దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి హర్భజన్ సింగ్ ఐదు పరుగులతో, భువనేశ్వర్ కుమార్ ఖాతా తెరవకుండా.. నాటౌట్ గా క్రీజ్ లో వున్నారు. మొత్తానికి ఎనిమిది వికెట్లను కోల్పయిన టీమిండియా 271 పరుగులు సాధించింది. జింబాబ్వే జట్టులో మజ్దీవా తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్ తో రాణించాడు. 49 పరుగులిచ్చి నాలుగు వికెట్లను పడగోట్టాడు. డోనాల్డ్ తిరిపానో, చమ్ము చిబ్బాబ్బ, బ్రాయన్ విటోరి, సికిందర్ రజ చెరో వికెట్ ను సాధించారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more