పసికూన జింబాబ్వే వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోవడం, తొలి టీ20లో భారీ తేడాతో ఓటమితో సహనం కోల్పోయిన ఆతిథ్య జట్టు రెండో టీ20లో నెగ్గి భారత్‌కు ఊహించని షాక్ ఇచ్చింది.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బౌలర్లు ఫర్వాలేదనిపించినా, బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యంతో భారత్ మూల్యం చెల్లించుకుంది. అలా పర్యటనను అజేయంగా ముగించాలన్న ఆశ నెరవేరకుండాపోయింది. తొలుత సహ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కడుతుంటే చిభాభా బాధ్యతాయుత ఇన్నింగ్స్.. అనంతరం సహ బౌలర్లు వికెట్ల వేటలో తడబడుతుంటే, ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను కుదేలు చేసే క్రెమెర్ మిస్టరీ స్పిన్.. వెరసి చివరిదైన రెండో టీ20లో జింబాబ్వే అనూహ్య విజయం.. భారత్‌కు దిమ్మతిరిగిపోయే షాక్. ఈ మ్యాచ్‌లో 10 పరుగులతో ఓడి సిరీస్‌ను సోలోగా సొంతం చేసుకునే అవకాశాన్ని దూరం చేసుకుని జింబాబ్వేతో 1-1తో పంచుకుంది రహానే సేన.
భారత్ 146 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్.. క్రెమెర్ ధాటికి నిర్ణీత ఓవర్లలో 9వికెట్లకు 135 పరుగులే చేసింది. తొలి ఓవర్ మూడో బంతికే రహానే లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ కాగా, ఉతప్ప 25 బంతుల్లో 9 ఫోర్లతో 42 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయం దిశగా నడిపాడు. అయితే టీమ్స్కోరు 61 పరుగుల వద్ద ఉతప్ప కూడా బ్యాట్ ఎత్తేయడం, మరెవరూ పోరాట పటిమ చాటకపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. బిన్నీ 24 పరుగులు, తొలి అంతర్జాతీయ టీ20 ఆడిన సంజూ శాంసన్ 19 పరుగులు, అక్షర్ పటేల్ 13, మురళీ విజయ్ 13 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, మోఫూ, సీన్ విలియమ్స్‌లు ఒక్కో వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే.. ఓపెనర్ చిభాభా (51 బంతుల్లో 9 ఫోర్లతో 67) అర్ధసెంచరీతో మెరవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 145 పరుగుల గౌరవప్రదమైన లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. మరో ఓపెనర్ మసకద్జ 19, చిగుంబుర స్థానంలో వచ్చిన సీన్ విలియమ్స్ 17 రన్స్ చేశారు. లోయరార్డర్ మొత్తం తేలిపోయింది. ఎవరూ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. ఎక్స్‌ట్రాల రూపంలో భారత్ మొత్తం 16 పరుగులు ఇవ్వడం కూడా జింబాబ్వే ఈస్థాయి స్కోరు చేయడానికి ఊతమిచ్చింది. ఈ ఎక్స్ట్రా పరుగులే ఆ జట్టులో నాలుగో అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. భారత పేసర్లు భువనేశ్వర్, మోహిత్ శర్మ రెండేసి వికెట్లు కూల్చగా, సందీప్ శర్మ, బిన్నీ, స్పిన్నర్ అక్షర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. చిభాభా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌నూ సొంతం చేసుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more