ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ కోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో చిక్కకున్న 16 మంది క్రికెటర్లకు ఊరటనిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. కేరళ పేసర్ శ్రీశాంత్ తో పాటు అజిత్ చండీలా, అంకత్ చవాన్ లకు విముక్తి లభించింది. శనివారం ఢిల్లీ కోర్టు ఈ ముగ్గురు ఆటగాళ్లతో సహా నిందితులుగా వున్న మొత్తం 16 మంది క్రికెటర్లను నిర్ధోషులుగా ప్రకటించింది. ఆటగాళ్లపై నమోదు చేసిన అభియోగాలన్నింటినీ కోట్టివేస్తూ న్యాయస్తానం తీర్పును వెలువరించింది.
రెండేళ్ల క్రితం ఐపీఎల్ ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు శ్రీశాంత్, చండీలా, చవాన్ లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ ఆటగాళ్లకు బుకీలతో సంబంధాలున్నాయన , లంచాలు తీసుకుని పిక్సింగ్ లకు పా్ల్పడ్డారంటూ అభియోగాలు నమోదుచేసిన విషయం కూడా తెలిపిందే. వీరితో పాటు రాజస్థాన్ క్రికెటర్లు అమిత్ సింగ్, సిద్ధార్థ్ త్రవేది, హర్మీత్ సింగ్ తదితరులను నిందితులుగా చేర్చారు. బుకీలతో ఫోన్ లలో మాట్లాడిన సంబాషణలను ఢిల్లీ పోలీసులు రికార్డు చేశారు.
కాగా స్పాట్ ఫిక్సింగ్ కేసులో చిక్కకున్న 16 మంది క్రికెటర్లపై అరోపణలను పోలీసులు రుజువు చేయలేకపోయారు. దీంతో న్యాయస్థానం క్రికెటర్లను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో పోలీసులు క్రికెటర్లపై నమోదు చేసిన అభియోగాలను ఉపసంహరించుకున్నారు. కాగా రెండేళ్ల క్రితం 16 మందిపై స్పాట్ ఫక్సింగ్, బెట్టింగ్ అరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలోబిసిసిఐ వీరిపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీరిని నిషేధించింది. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో తాజాగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more