Dance wars: Yuvraj shows Shoaib Malik, Sania Mirza how it's done

Yuvi s dance silences shoaib sania

Billie Jean, Cricket, Dubsmash, Michael Jackson, Yuvraj Singh, Moonwalk, Sania Mirza, Shoaib Malik, Sports, Telangana brand ambassador, twitter, 'Indian Cricket, Pakistan Cricket, tennis star, latest tennis news, latest cricket news, india vs pakistan

The dance wars are getting entertaining day by day and this time it's the cricketers who are involved in it.

షోయబ్, సానియాలకు నిశబ్దాన్ని మిగిల్చిన యూవీ డాన్స్

Posted: 07/28/2015 07:11 PM IST
Yuvi s dance silences shoaib sania

సామాజిక మాధ్యమం ట్విట్టర్ లో ఇప్పుడు ఇద్దరు క్రికెటర్ల మధ్య పోటీకి తెరలేపడంతో.. ఒకరు విసిరిన సవాల్ మరోకరు స్వీకరించి.. అవతలి వారికి నిశబ్దాన్ని మిగిల్చారు. అంతర్జాలం అందుబాటులోకి రాగానే ప్రపంచమే చిన్నదిగా మారిన తరుణంలో.. సామాజిక మాధ్యమం ద్వారా ఇక సెలబ్రిటీలకు కూడా సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎదురవుతున్నాయి. నమ్మశక్యంగా లేదా..? వారం రోజుల క్రితం శ్రీలంకపై పాకిస్తాన్ మూడో వన్డే గెలిచిన తరువాత పాక్ క్రికెటర్లతో కలసి చిందులేస్తూ.. అందులో తన అర్థాంగి, ఇండియన్ టెన్నీస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జాతో కలసి డాన్స్ చేస్తూ సంబరాల జరుపుకున్న వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేసి పార్టీ ఇప్పుడే మొదలైందంటూ ట్విట్ చేశాడు.

అయితే ఈ వీడియోపై భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. సానియా మిర్జా, షోయబ్ మాలిక్ ఇద్దరు మంచి ఆటగాళ్లే కానీ ఘోరమైన డాన్సర్లుంటూ ట్విట్ చేశారు. దీనిని లైట్ గా తీసుకోని షోయబ్ మాలిక్.. యవరాజ్ సింగ్ కు సవాల్ విసిరాడు. అయితే నువ్వు గ్రౌండ్ లోకి రా అంటూ విసిరిన సవాల్ కు యువరాజ్ సింగ్ కూడా బదులిచ్చాడు. అంతే యువరాజ్ సింగ్ ఇచ్చిన బదులుతో షోయబ్ మాలిక్, సానియా మిర్జాలిద్దరికి నిశబ్దమే మిగిలింది. ఇంతకీ యువరాజ్ సింగ్ ఇచ్చిన బదులేంటనేగా మీ ప్రశ్న.

మైదానంలోకి రా అంటూ షోయబ్ మాలికి విసిరిన సవాల్ ను యూవీ కూడా సీరియస్ గా తీసుకుని నేను ఎప్పుడు మైదానంలోనే వున్నాను అంటూ ట్విట్ చేశాడు. అంతటితో ఆగకుండా తాను డ్యాన్స్ చేసిన వీడియోను కూడా ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు. అది ఏకంగా మైకేల్ జాక్సన్ ప్రఖ్యాత బిల్లీ జీన్ అ్భం నుంచి మూన్ వాక్ డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ అదరగోట్టేశాడు యూవి. డ్యాన్స్ అంటే ఇదేరా అని చెప్పకనే చెప్పినట్లు వున్న వీడియో సానియా మిర్జా షోయబ్ మాలిక్ లను మౌనమ నా మాట అన్నట్లు చేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Michael Jackson  Yuvraj Singh  Moonwalk  Sania Mirza  Shoaib Malik  twitter  

Other Articles