mitchell johnson: Australian bowler fastest to 300 Test wickets

Mitchell johnson joins 300 test wicket club

Australia, England, Dale Steyn, Cricket, Dale Steyn Joins 400 Test Wicket Club, India spinner Harbhajan Singh, England paceman James Anderson, latest Cricket news

AS Dale Steyn reached his landmark 400 wickets club, the same day Australian bowler mitchell johnson joins 300 Test wicket club in ashes series second test against england.

300 వికెట్ల క్లబ్ లోకి మిచెల్ జాన్సన్

Posted: 07/30/2015 08:36 PM IST
Mitchell johnson joins 300 test wicket club

ఇవాళ ప్రపంచ క్రికెట్ కి శుభదినంలా వుంది. ఓ వైపు దక్షిణాఫ్రికా కు చెందిన టాప్ బౌలర్ డెల్ స్టెయిన్. నాలుగు వందల వికెట్ల క్లబ్ లో చేరిన రోజునే అటు అస్ట్రేలియాకు కూడా అలాంటి శుభవార్తనే అందించాడు మరో పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్. ఇవాళ ఆయన కూడా మరో ఘనత కూడా సాధించారు. యాషెస్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఆయన కూడా 300 వికెట్ల క్లబ్ లో చేరాడు. ఈ ఘనత సాధించిన ఐదవ అస్ట్రేలియన్ బౌలర్ గా కూడా ఆయన అరుదైన రికార్డును సాధించారు.

గతంలో అస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ తో పాటుగా డెన్నీస్ లిల్లీ, గ్లెన్ మెక్ గ్రాత్, బ్రెట్ లీ ఈ అరుదైన ఫీటును సాధించారు. అదే సమయంలో టెస్టులో రెండు వేల పరుగులను సాధించడంతో పాటు 300 విక్కెట్లను పడగోట్టిన అస్ట్రేలియన్ ప్లేయర్ల జాబితాలో మిచెల్ జాన్సన్ రెండవ వాడిగా నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డును షేన్ వార్న్ నెలకొల్పాడు. ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హమ్ లో అతిథ్యజట్టుతో జరుగుతున్న యాషెస్ సిరీస్ లో మిచెట్ రెండో టెస్టు తొలిరోజు ఈ రికార్డును సాధించాడు. 69 మ్యాచ్ లలో మిచెల్ జాన్సన్ ఈ ఫీటును సాధించడంతో ఆయనకు టీమ్ మేట్స్ నుంచి అభినందనలు వెల్లివిరిసాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia  England  mitchell johnson  300 Test wicket club  Cricket  

Other Articles