Dhoni invites his old friend at home after 5 years!

Dhoni called vipin singh for breakfast

Mahendra Singh Dhoni, Sakshi Dhoni, Ziva, friendship day, Vipin Singh, Ranji for Jharkhand, Ranji for Chattisgarh, Dhoni called him for breakfast, celebrity, sakshi glamorous on television, sakshi very homely

Dhoni had not had a word with Vipin for more than 5 years and it was a huge surprise for Vipin when Dhoni called him for breakfast

విపిన్ సింగ్ ను బ్రేక్ ఫాస్ట్ కు ఆహ్వానించిన ధోని

Posted: 08/04/2015 06:46 PM IST
Dhoni called vipin singh for breakfast

విపిన్ సింగ్ ను టీమిండియా క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్రేక్ ఫాస్ట్ కు ఆహ్వానించారు. అవునా అనే వాళ్లు కొందరే.. కానీ ఎవరీ విసిన్ సింగ్ అనేవాళ్ల సంఖ్యమాత్రం అనేకం. విపిన్ సింగ్ ధోణి స్నేహితుడు. ఫ్రెండ్‌షిప్‌ డే రోజు పాత మిత్రుడు విపిన్ సింగ్ ను ధోనీ సర్‌ప్రైజ్‌ చేశాడు. తన స్నేహితుడిని కుటుంబ సమేతంగా తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు రమ్మని ఆహ్వానించి ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇందులో ఆశ్చర్యమేముంది అంటారా..? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే...

టీమిండియాలోకి రాకముందు రంజీ స్థాయిలో ఆడే రోజుల్లోని మిత్రుడిని గుర్తపెట్టుకుని బ్రేక్ ఫాస్ట్ కు ఆహ్వానించడం హర్షణీయమే కదా. ధోణి జార్ఖంగ్ నుంచి రంజీకి ఆడుతున్న సమయంలో రైల్వేస్‌లో టీటీగా పని చేసేవాడు. అదే సమయంలో  ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రంజీ ఆటగాడు విసిన్ సింగ్ కూడా ఛత్తీస్‌గఢ్‌ తరపున రంజీలో ఆడేవాడు. అయితే అతను కూడా రైల్వేస్ లో టీటీగా జాబ్ చేస్తుండేవాడు. దీంతో టోర్నీ సమయాల్లో ఇద్దరూ ఒకే రూమ్‌లో ఉండేవారు. అలావారి స్నేహం చిగురించింది

అయితే గత ఐదేళ్లుగా విపిన్‌తో ఒక్క మాట కూడా మాట్లాడని ధోనీ.. ఆదివారం తన ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కు రావాల్సిందిగా ఫోన్‌ చేసి అతణ్ణి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆహ్వానం మేరకు విపిన్‌.. ధోనీ కుటుంబాన్ని కలిశాడు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ.. తాను ధోణికి కలవడంలో పెద్దగా ఊహించుకోవడం లేదని, తాను ఒక స్నేహితుడిని కలిశానని మాత్రం మర్చిపోలేని మధుర జ్ఞాపకం అన్నాడు. సాక్షి ధోణి టీవీలో ఎంతో అందెగత్తెలా కనబడుతుందని, కానీ నిజజీవితంలో ఆమె చాలా చక్కని గృహిణి అన్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra Singh Dhoni  Vipin Singh  friendship day  

Other Articles