Modi reveals blueprint of breakaway cricket body to rival ICC | Lalit modi controversy

Lalit modi to introduce blueprint of new cricket body to rival icc

lalit modi, lalit modi blueprint, new cricket world, icc, new cricket, lalit modi controversy, modi controversies, money scam, modi money scams

Lalit Modi To Introduce blueprint of New Cricket body to rival ICC : The controversial administrator Lalit Modi said his plan would only fail if the ICC carries out reforms. He is living in exile and facing arrest but that has not stopped sacked IPL Commissioner Lalit Modi from preparing the blueprint for a breakaway governing body for cricket to rival the ICC

మోదీ ‘బ్లూప్రింట్’ వ్యూహం

Posted: 08/10/2015 06:02 PM IST
Lalit modi to introduce blueprint of new cricket body to rival icc

అక్రమంగా డబ్బు తరలింపు, టెలివిజన్ ప్రసారాల హక్కుల విషయంలో అక్రమాలు వంటి కేసులను ఎదుర్కొంటున్న ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ సరికొత్త వ్యూహంతో మళ్లీ వార్తల్లోకెక్కాడు. భారత పోలీసుల విచారణ నుంచి తప్పించుకుని విదేశాల్లో పాగా వేసిన ఈయన.. ఒలింపిక్స్ కు అనుబంధంగా ఉండేలా, అన్ని ప్రపంచ దేశాలనూ భాగం చేస్తూ, సరికొత్త క్రికెట్ గవర్నింగ్ బాడీ త్వరలో రానుందని ఆయన స్పష్టం చేశాడు. ఇప్పటికే దానికి సంబంధించిన బ్లూప్రింట్ సిద్ధమైందని ఆయన వివరించారు. ఈ కొత్త క్రికెటింగ్ సిస్టమ్ ఎంతో జనరంజకంగా వుంటుందని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం లండన్ లో తలదాచుకుంటున్న మోదీ.. ఆస్ట్రేలియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కు తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సరికొత్త క్రికెటింగ్ సిస్టమ్ ను తీసుకురానున్నట్లు పేర్కొన్నాడు. దీన్ని తయారు చేసేందుకు సంవత్సరాల తరబడి ప్రణాళికలు రూపొందించినట్లు స్పష్టం చేశాడు. ఐసీసీ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు దీన్ని తయారు చేశానని చెప్పాడు. ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రపంచ క్రికెట్ రంగాన్ని ఇతర దేశాలకు దగ్గర చేయాలన్న అభిమతంతోనే తాను ఈ కొత్తరకం క్రికెట్ ను ప్రవేశపెడుతున్నానని పేర్కొన్నాడు. చాలాకాలం క్రితమే ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లుగా తెలిపిన ఆయన.. అప్పట్లో ఈ ప్రాజెక్టు నుంచి తనను బలవంతంగా గెంటేశారని అన్నాడు. ఆ కారణంతో ఆ ప్రాజెక్టుపై అప్పుడు దృష్టి పెట్టలేకపోయానని.. కానీ ఇప్పుడు దానిపై తిరిగి మనసు పెట్టానని వెల్లడించాడు.

ఈ కొత్తరకం క్రికెట్ కార్యరూపం దాల్చేందుకు కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బు అవసరమవుతుందని, నగదు సమీకరణ పెద్ద కష్టం కాదని అంటున్నాడు. ఐసీసీకి పోటీగా ఉండే ఈ కొత్త క్రికెట్ వ్యవస్థలో వన్డే పోటీలుండవని.. టీ-20లు, టెస్టు మ్యాచ్ లు మాత్రమే ఉంటాయని అన్నాడు. అయితే.. దీనిని ఎప్పుడు ప్రవేశపెట్టనున్న విషయం మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lalit modi  new cricket blueprint  

Other Articles