ప్రజల మత విశ్వాసాలను కించపరిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో టీమిండియా టి-20, వన్డే జట్ల కెప్టెన్ ధోనీ తెలుసుకోవాలని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. ఓ వాణిజ్య ప్రకటనలో ధోనీ హిందూ దేవుణ్ని అగౌరవపరిచాడంటూ ఆయనపై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు విచారించింది. ఉన్నత న్యాయస్థానం ధోనీ తీరును ఆక్షేపించింది. ధోనీ వంటి సెలెబ్రిటీలు కేవలం డబ్బు కోసమే యాడ్స్ చేస్తారు. వాటి పర్యవసానాల గురించి ఆలోచించరని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాధ్యత లేకుండా యాడ్స్‌పై సంతకాలు చేస్తారే కాని.. వాటివల్ల ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించరని వ్యాఖ్యానించింది.
ధోని సహా సెలబ్రిటీల లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే అని కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఏఎన్ వేణుగోపాల్ గౌడ పేర్కొన్నారు. షూలు ధరించి, చేతిలో పలు వస్తువులు పట్టుకుని, విష్ణుమూర్తి రూపంలో ఉన్న ధోనీ చిత్రాన్ని ఓ బిజినెస్ మేగజైన్ కవర్ పేజీలో ప్రచురించడంపై సామాజిక కార్యకర్త జయకుమార్ హీరేమత్ ఫిర్యాదు చేశారు. కాగా కవర్ పేజీపై ప్రకటన కోసం ధోనీ డబ్బులు తీసుకోలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ గౌడ స్పందిస్తూ.. డబ్బులు తీసుకోనట్టుగా నిర్దారిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ధోనీని అదేశించారు. కోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more