Sourav Ganguly Becomes Brand Ambassador of 2017 FIFA Under-17 World Cup

Kohli has the same passion as maradona sourav ganguly

Cricket, Sourav Ganguly, former indain captain, ganguly Brand Ambassador, ganguly ambassador of 2017 FIFA Under-17 World Cup, virat kohli, body language, Brand Ambassador, 2017 FIFA Under-17 World Cup, maradona, latest Cricket news

Sourav Ganguly, who co-owns a football team in the Indian Super League, is the first non-cricketer to become brand ambassador of the 2017 FIFA Under-17 World Cup to be played in India.

కోహ్లీని మారడోనాతో పోల్చిన దాదా

Posted: 08/13/2015 06:44 PM IST
Kohli has the same passion as maradona sourav ganguly

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. కోహ్లిని ఫుల్ బాల్ దిగ్గజం డిగో మారడోనాతో పోల్చాడు. కోహ్లి విజృంభణ, క్రికెట్ పట్ల అతడికున్న అనురక్తి తనను ఎంతో గానో ఆకట్టుకుంటాయని చెప్పాడు.
ఇవాళ అండర్ 17 ఫిపా ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. సచిన్ టెండుల్కర్ స్థానంలో సౌరవ్ గంగూలీ నూతన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఫుట్ బాల్ క్రీడ పట్ల ఆయనకు వున్న ఆసక్తితో తాను సొంతంగా అట్లిటటికో డా కోల్ కత్తా జట్టకు సహ యజమానిలా కూడా వ్యవహరిస్తున్న ఆయనకు ఈ అదృష్టం వరించింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు 2017 వరకు కొనసాగనున్నారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఇష్టమైన క్రీడాకారుడు డిగో మారడోనా అని తెలిపారు.. అతడు ఫుట్ బాల్ ఆడుతుంటే ఆట పట్ల ఉన్న పాషన్ కొట్టిచ్చినట్టు కనబడుతుందన్నారు. ఇలాంటి లక్షణాలే కోహ్లి ఆటలో కనబడతాయని పోల్చారు. అతడి బాడీ లాంగ్వేజ్ అంటే తనకెంతో ఇష్టమన్నారు. కోహ్లికి తాను పెద్ద ఫ్యాన్' అని గంగూలీ పేర్కొన్నాడు. మైదానం వెలుపలా కోహ్లి అంతే కాన్ఫిడెన్స్ తో ఉంటాడని చెప్పాడు. కోహ్లిని గ్రౌండ్ లో లేదా టీవీలో చూసినా అతడిలో తనకు అంతులేని విశ్వాసం కనబడుతుందన్నాడు. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. కెప్టెన్ అతడికిది నాలుగో టెస్టు సెంచరీ. ఇప్పటివరకు 11 టెస్టు సెంచరీలు కోహ్లి ఖాతాలో ఉన్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles