Rohit or Pujara? The burning question ahead of Colombo Test

Is rohit sharma the right choice for no 3

chateswar pujara, test cricket, srilanka vs India, Rohit sharma, India vs Sri Lanka, India, India in Sri Lanka 2015, Sports, Sri Lanka, Virat Kohli, Ravichandran ashwin, amit mishra, Harbhajan Singh, cricket, srilanka tour, ind vs srl, ind vs sri 2015, srilanka, India, India Vs Sri Lanka Live live cricket, Live Cricket Score

Rohit or Pujara? The burning question ahead of Colombo Test

ఛత్తీశ్వర్ పూజారాను జట్టులోకి తీసుకోవాలని పెరుగుతున్న ఒత్తిడి

Posted: 08/17/2015 07:24 PM IST
Is rohit sharma the right choice for no 3

శ్రీలంకతో తొలి టెస్టులో ఒక్క సెషన్ మొత్తం అట స్వరూపాన్నే మార్చేసింది. అంతేకాదు.. కోహ్లీ సేన చేతిలో చిక్కిన విజయాన్ని లంకేయులు లాగేసుకున్నారు. అంతలా మ్యాచ్ మొత్తాన్ని తిప్పడానికి కారణాలు ఏమిటి అన్న విషయంలో ఇప్పుడు అభిమానుల్లో చర్చ మొదలైంది. మూడు రోజులు ఆధిపత్యం వహించి.. నాలుగో రోజు ఒక్క సెషన్‌లో చెత్త బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను అప్పగించేసింది భారత జట్టు. నాలుగో రోజు 9 వికెట్లు చేతిలో ఉంచుకొని 153 పరుగులు చేయలేకపోయింది. అంటే భారత్ తరపున నిలదోక్కుకుని పరుగులు చేయగల బ్యాట్సమెన్లు లేరా..? ఉంటే వారినెందుకు తీసుకోలేదు. అన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

టీమిండియా ఈ టెస్టులో నెగ్గితే కోహ్లీ కెప్టెన్సీపై నమ్మకాలు పెరిగేయి. అయితే ఒడిన నేపథ్యంలో కోహ్లీ తాను అవలంభించిన పద్దతులను మరోమారు సరిగ్గా అధ్యయనం చేయాలన్న సూచనలు కూడా వినబడుతున్నాయి.  రెండో టెస్టుకు ధావన్ కూడా దూరం కానున్న నేపథ్యంలో ఆయన స్థానంలో చత్తీశ్వర్ పూజరాను తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. తొలి టెస్టులోనే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మపైనే. సీనియర్లు, క్రీడా పండితుల మాటలు కూడా వినకుండా టెస్టు స్పెషలిస్ట్ పుజారాను పక్కన పెట్టి మరీ రోహిత్‌ను జట్టులోకి తీసుకున్నారని.. అయితే. రోహిత్ మాత్రం మ్యాచ్‌లో ఘోరమైన ప్రదర్శన చేశాడన్న విమర్శలు వినబడుతున్నాయి. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 13 పరుగులే చేశాడు. కీలకమైన మూడోస్థానంలో వచ్చి కనీసం టెయిలెండర్ల స్థాయి ఆటతీరు కూడా కనబర్చలేదు.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chateswar pujara  test cricket  srilanka vs India  Rohit sharma  

Other Articles