Finally Virat Kohli Cricket Team Won Second Test Against Sri Lanka In Colombo | Ravichandran Ashwin

Indian cricket team won second test against sri lanka in colombo

india vs sri lanka, sri lanka vs india, india won against sri lanka, india sri lanka colombo test, india vs sri lanka colombo test, ravi chandran ashwin, amit mishra, virat kohli, team india cricket, india cricket team, india sri lanka tour

Indian Cricket Team Won Second Test Against Sri Lanka In Colombo : Finally Virat Kohli Cricket Team Won Second Test Against Sri Lanka In Colombo.

భారత్ ‘స్పిన్’కు విలవిల్లాడిన లంక..

Posted: 08/24/2015 01:03 PM IST
Indian cricket team won second test against sri lanka in colombo

కోలంబో వేదికగా అతిథ్య జట్టు శ్రీలంకతో ఆడిన రెండో టెస్టు మ్యాచులో భారత్ ఘనవిజయం సాధించింది. మొదటి టెస్టు మ్యాచులో పేలవ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించిన టీమిండియా స్పిన్నర్లు ఈసారి పుంజుకుని ఇండియాకు విజయాన్ని అందించారు. ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లే తమ ప్రతిభతో లంక ఆటగాళ్లను ముచ్చెమటలు పట్టించారు. దీంతో లంకేశ్వరులు ఒక్కొక్కరు పవెలియన్ చేరారు. ఈ విజయంతో కోహ్లీకి కెప్టెన్ గా తొలి టెస్టు విజయం సాధించినట్లయ్యింది.

రెండో టెస్టు మ్యాచులో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆటగాళ్లు.. బౌలింగ్ లోనూ అద్భుత తీరుతో లంకేయులను వరుసగా పవెలియన్ పంపించడంతో 87 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ అదే దూకుడుతో మైదానంలో దిగిన టీమిండియా.. ఎనమిది వికెట్ల నష్టానికి 325 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో లంకముందు 413 పరుగులు విజయాలక్ష్యాన్ని నిర్ధేశించింది. మొదటి టెస్టు మ్యాచును గెలుపొందిన లంక.. ఈ రెండో టెస్టులోనూ గెలుపొందాలనే ఆశతో తమ పరుగుల వేటను కొనసాగించారు. కానీ.. ఆ ఆవేశంతో దూకుడుగా ప్రదర్శించి, ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో భాగంగానే సంగక్కర తన చివరి ఇన్నింగ్స్లో 18 పరుగులకు అవుటయ్యాడు.

ఇక ఐదోరోజు ఆటను కొనసాగించిన లంక జట్టు.. తుదినుంచే పేలవ పెర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తూ వచ్చారు. ఆట ప్రారంభం కాగానే తొలి బంతికే మాథ్యూస్ ఔటవ్వడంతో లంకకు కష్టాలు మొదలయ్యాయి. అటు భారత బౌలర్లు లంక ఆటగాళ్లను కట్టడి చేసి, వికెట్లు తీయడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా స్పిన్నర్లు తమ ‘స్వింగ్’ మాయాజాలాన్ని ప్రదర్శించడంతో లంక ఆటగాళ్లు వరుసగా పవెలియన్ చేరారు. చివరగా శ్రీలంక 134 పరుగులకే ఆలౌటైంది. దీంతో 278 పరుగుల భారీ తేడాతో ఇండియా ఘనవిజయం సాధించింది. ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ ఐదు వికెట్లు తీసుకోగా.. మిశ్రాకు మూడు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో మూడు టెస్ట్ ల సిరీస్ లో భారత్ 1-1తో సమం చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs sri lanka  colombo test match  virat kohli  

Other Articles