Yuvraj Singh reportedly dating British model-actress Hazel Keech

Yuvraj singh dating bodyguard actress hazel keech

yuvraj singh, yuvraj singh girlfriend, yuvraj singh affair, yuvraj singh dating, hazel keech, yuvraj hazel keech, yuvraj singh hazel keech, cricket news, cricket

Yuvraj Singh is in the news again, not for his on-field exploits but for his reported affair with ‘Bodyguard’ actress Hazel Keech.

లండన్ లో ఆ నటితో యువరాజ్ డేటింగ్..?

Posted: 09/08/2015 06:57 PM IST
Yuvraj singh dating bodyguard actress hazel keech

ఆటలో అతను మనస్సుపెట్టి రాణించిన క్షణంలో తన ఎదురుగా వచ్చి బంతులు వేయాలంటే.. చండ, ప్రచండులని ఖ్యాతిపోందిన బౌలర్లకే చమటలు పడతాయి. అదే స్థాయిలో తన మనస్సుకు నచ్చిన అమ్మాయి కనబడితే చాలా వారికి గాలం వేసి బుట్టలో వేసుకోవడంలో సమర్థుడు క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌. గతంలో కొందరు బాలీవుడ్‌ భామలతో అఫైర్‌ నడిపి వార్తల్లో నిలిచిన యువీ.. తాజా గా మరో నటితో ప్రేమలో పడ్డాడట. ఇంకా విచిత్రమేమిటంటే.. ఆ నటితో కలసి లండన్ లో హాలిడేలు జరుపుకుంటూ డేటింగ్ చేస్తున్నాడని కూడా టాక్. ఇంతకీ ఎవరా నటి అంటారా..?

బ్రిటిష్‌ మోడల్‌, యాక్టర్‌ హాజెల్‌ కీచ్‌తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయు. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారట! ఇటీవల ఈ జంట లండన్‌లో బాగా ఎంజాయ్‌ చేసి.. మళ్లీ భారత్‌కు రావడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. ఇద్దరి మధ్య గాఢమైన బంధమే పెనవేసుకుని ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌..! సల్మాన్‌ బ్లాక్‌బస్టర్‌ ‘బాడీ గార్డ్‌’తో గుర్తింపు తెచ్చుకున్న 28 ఏళ్ల హాజెల్‌.. బిల్లా సినిమాతోపాటు, ఓ కార్‌ యాడ్‌లోనూ నటించింది. గతంలో కూడా బాలీవుడ్‌ భామలు దీపిక పదుకోన్‌, ప్రీతి జింతా, కిమ్‌ శర్మ, నేహా ధూపియాతో యువీ అఫైర్‌లు నడిపాడని ఇండస్ట్రీ వర్గాలు కోడై కూసాయి కూడా.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : yuvraj singh  cricket  dating  hazel keech  actress  

Other Articles